- లాంచ్ అయిన కరేరా మరియు దాని GTS మోడల్స్
- కొత్త హైబ్రిడ్-టెక్ తో వస్తున్న కొత్త మోడల్స్
పోర్షే ఇండియా కొత్త 911 కరేరా మరియు కరేరా 4 GTS బుకింగ్స్ ని ప్రారంభించింది. కొత్త 911 కరేరా మోడల్ ఎక్స్-షోరూం ధర రూ.1.99 కోట్లు ఉండగా, కరేరా 4 GTS మోడల్ ఎక్స్-షోరూం ధర 2.75 కోట్లుగా ఉంది.
కార్ మేకర్ నుంచి వచ్చిన మొట్టమొదటి హైబ్రిడ్ 911 మోడల్ 29 మే,2024న అరంగేట్రం చేయగా, దానికి ధీటుగా నేడు ఇండియన్ 911 కరేరా రేంజ్ మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఈ సంవత్సరం చివరలో ఈ కార్ల డెలివరీ ప్రారంభంకానుండగా, ఇవి రీఫ్రెష్డ్ లుక్, అప్ గ్రేడెడ్ ఇంటీరియర్, మెరుగైన హ్యాండ్లింగ్ మరియు మరింత పవర్ ఫుల్ గా రానున్నాయి.
కొత్త 911 ఇంజిన్ వివరాలు
పవర్ ట్రెయిన్ ఆప్షన్ల పరంగా, కొత్త 911 కరేరా మరియు కరేరా 4 GTS మోడల్స్ కొత్త 3.6-లీటర్ ఫ్లాట్-6 ఇంజిన్ తో వచ్చాయి. ఈ ఇంజిన్ 478bhp మరియు 570Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, కార్ మేకర్ ఇందులో హైబ్రిడ్ టెక్ సహాయంతో రెండు యూనిట్లకు బదులుగా సింగిల్ ఎలక్ట్రిక్ టర్బో చార్జర్ ని తీసుకువచ్చింది. 7వ జనరేషన్ 911 మైల్డ్-సైకిల్ తయారీలో భాగంగా హైబ్రిడైజేషన్ ని తీసుకురాగా, ఇది 526bhp మరియు 610Nm ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. స్టాండర్డ్ 911 మోడల్స్ డ్యూయల్-టర్బో అరెంజ్ మెంట్ ద్వారా 3.0-లీటర్ ఫ్లాట్-6 ఇంజిన్ తో కొనసాగుతున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్