- ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కొనుగోలు
- రేంజ్ రోవర్ ఎక్స్-షోరూం ధర రూ. 3.08 కోట్లు
సౌత్ ఇండియాలో వరుస సినిమా ఆఫర్లతో మోస్ట్ పాపులర్ నటిగా పేరొందిన సినీ నటి పూజా హెగ్డే తన పుట్టినరోజు సందర్భంగా ఒక కొత్త కారును కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ కారు ఫోటోలు కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇంతకీ ఈ కారు పేరు ఏంటి అంటే, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారు. రూ.3.08 కోట్లు (ఎక్స్-షోరూమ్) వెచ్చించి, అత్యంత ఖరీదైన లగ్జరీ కారును పూజా హెగ్డే కొనుగోలు చేసింది. ఈ కారు ప్రత్యేకత విషయానికి వస్తే, గంటకు 242 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది. అలాగే, కేవలం 5.9 సెకన్లలో 0-100 కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది.
రేంజ్ రోవర్ కారులో కీలక భాగంగా పేర్కొనే ఇంజిన్ విషయానికి వస్తే, ఈ కారు కొత్త రెండు ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. అందులో 3.0-లీటర్, 6-సిలిండర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ మరియు 48-వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ డీజిల్ ఇంజన్ వంటివి ఉన్నాయి. పెట్రోల్ యూనిట్ 394bhp మరియు 550Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా, డీజిల్ ఇంజన్ 346bhp మరియు 700Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఎక్స్‌టీరియర్ పరంగా, కొత్త రేంజ్ రోవర్ కారు బయటి వైపు సిగ్నేచర్ హెడ్‌ల్యాంప్స్, డీఆర్ఎల్స్ తో కొత్త ఫ్రంట్ ఫేసియాను కలిగి ఉంది. అలాగే ఇంటీరియర్ పరంగా, పెద్ద 13.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త అప్హోల్స్టరీ, సన్‌రూఫ్, ఈటీఏ సిస్టమ్ తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇంకా దీని ఇన్ఫోటైన్మెంట్ సిస్టం బిల్ట్-ఇన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ని కూడా పొందింది. సేఫ్టీ పరంగా ఈ కారు, యూరో ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ని పొందింది.
ఇంకా పోటీ విషయానికి వస్తే, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారు పోర్షే కాయెన్ మరియు మసెరటి లెవాంటే వంటి కార్లతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్