- ప్రస్తుతం రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎక్స్-షోరూం ధర రూ.7.50 కోట్లు
- కేవలం 4.5 సెకన్లలో 0-100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటున్న స్పెక్టర్ ఈవీ మోడల్
RRR మూవీ తర్వాత పాన్-ఇండియా స్టార్ రామ్ చరణ్ పేరు దేశమంతటా మారుమ్రోగుతుంది. ఇప్పుడు ఈ పేరు చెబితే తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. రామ్ చరణ్ అంటే సినిమాలు మాత్రమే కాదు, తనకు లగ్జరీ కార్లపై ఉన్న మక్కువ అందరికీ గుర్తుకువస్తుంది. ఇది వరకే ఈ హీరో గ్యారేజీలో వివిధ బ్రాండ్లకు చెందిన ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా రామ్ చరణ్, అతని భార్య ఉపాసనతో కలిసి ఎయిర్ పోర్టులో బ్రిటిష్ లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్ తయారుచేసిన బ్లాక్ కలర్ స్పెక్టర్ కారులో కనిపించారు. అయితే, ఈ ఆర్టికల్ ద్వారా మనం రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారు ధర, దీని టాప్-స్పీడ్ మరియు కీలక ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
బ్రిటిష్ లగ్జరీ ఆటోమేకర్, రోల్స్ రాయిస్ ఇండియాలో దాని మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు స్పెక్టర్ ని రూ. 7.50 కోట్లు (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. ఈ లగ్జరీ కారును సింగిల్ ఫుల్లీ లోడెడ్ అనే వేరియంట్ లో పొందవచ్చు.
కారు ముందు భాగంలోని డిజైన్ గురించి చెప్పాలంటే, స్పెక్టర్ స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీతో ఐకానిక్ ఇల్యూమినేటెడ్ పాంథియోన్ ఫ్రంట్ గ్రిల్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్లోపింగ్ రూఫ్‌లైన్, వర్టికల్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ మరియు 21-ఇంచ్ ఏరో-డిజైన్డ్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.
ఇంటీరియర్ పరంగా స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారులో లోపల, వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీతో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-టోన్ ప్రీమియం ఇంటీరియర్, డోర్ మరియు డ్యాష్‌బోర్డ్‌పై ఇల్యూమినేటెడ్ ప్యానెల్స్ మరియు సీట్ అప్హోల్స్టరీ వంటి బెస్ట్ ఫీచర్లను పొందింది.
రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారు 3.0 ప్లాట్‌ఫారమ్ నుంచి రాగా, దీని 102kWh లిథియం-అయాన్ బ్యాటరీని 195kW డిసిఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 34 నిమిషాల్లో 10-80 శాతం నుండి ఛార్జ్ చేయవచ్చు. ఈ ప్యాక్ 575bhp మరియు 900Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. లగ్జరీ కారు అంటే, ఎవరైనా సరే ఫీచర్లు మరియు టాప్-స్పీడ్ గురించే మాట్లాడుతారు. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కేవలం 4.5 సెకన్లలో 0-100 కిలోమీటర్లవేగాన్ని అందుకుంటుంది. అలాగే, స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీని ఒకసారిపూర్తిగా ఛార్జ్ చేస్తే 530 కిలోమీటర్లు డబ్లూఎల్ టిపి-క్లెయిమ్డ్ రేంజ్ మైలేజీని అందిస్తుంది.