- ఆరు వేరియంట్లలో లభ్యం
- దసరా పండుగ నుంచి కార్ల డెలివరీ ప్రారంభం
ఇండియా దిగ్గజ కార్ల సంస్థ మహీంద్రా కంపెనీ దాని లేటెస్ట్ ఆఫ్-రోడ్ ఎస్‍యూవీ థార్ రాక్స్ ద్వారా అద్బుతమైన రికార్డు మైల్ స్టోన్ ని సాధించింది. థార్ రాక్స్ కి సంబంధించిన బుకింగ్స్ గురువారం ప్రారంభమవ్వగా, బుకింగ్స్ మొదలైన మొదటి గంటలోనే అపూర్వ స్పందన ద్వారా ఒక లక్షా 76 వేలకు పైగా బుకింగ్స్ అందుకుంది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, థార్ రాక్స్ కార్ల డెలివరీ దసరా పండుగ నుంచి ప్రారంభంకానుంది, అంటే వారం నుంచి పది రోజుల వ్యవధిలో థార్ రాక్స్ కారు మీ ఇంటి ముందు ఉంటుందన్నమాట.
మొత్తంగా ఫైవ్-డోర్ మహీంద్రా థార్ రాక్స్ కారు ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉండగా, అందులో MX1, MX3, MX5, AX3L, AX5L, మరియు AX7L అనే వేరియంట్లు ఉన్నాయి. బేస్ వేరియంట్ ఎక్స్-షోరూం ధర రూ.12.99 లక్షలు ఉండగా, టాప్ స్పెక్ వేరియంట్ ఎక్స్-షోరూం ధర రూ.18.79 లక్షలు ఉంది. వీటిని ఆర్‌డబ్లూడీ మరియు 4x4 వెర్షన్లలో మీరు కొనుగోలు చేయవచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే, 4x4 వెర్షన్లు ఎక్స్‌క్లూజివ్ గా థార్ రాక్స్ డీజిల్-పవర్డ్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
థార్ రాక్స్ గురించి ఇంకా చెప్పాలంటే, ఇందులోని 4X4 వెర్షన్ కార్లు కొత్త మోచా బ్రౌన్ ఇంటీరియర్ థీమ్ తో వచ్చాయి. ఇది పెట్రోల్ లేదా ఆర్‌డబ్లూడీ వెర్షన్ కార్లలో అందుబాటులో లేదు. ఇంజిన్ విషయానికి వస్తే, బానెట్ కింద థార్ రాక్స్ రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. 2.0-లీటర్ ఎంస్టాలియన్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్లను 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్లతో జతచేసి పొందవచ్చు.
ప్రస్తుతం, మహీంద్రా థార్ రాక్స్ కారు ఆఫ్-రోడ్ ఎస్‍యూవీ సెగ్మెంట్లో ప్రధానంగా మారుతి సుజుకి జిమ్నీ మరియు ఫోర్స్ గూర్ఖా వంటి కార్లతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్