- ప్రస్తుత సంవత్సరం 24.22 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు
- తాజాగా 9 లక్షలకు పైగా ఉత్పత్తితో మహీంద్రా ఖాతాలో చేరిన మరో మైలురాయి
ఈ నెల ప్రారంభంలో, మహీంద్రా కంపెనీ సెప్టెంబర్-2023కి సంబంధించి సేల్స్ డేటాను ప్రకటించింది. ఇప్పుడు, ఈ ఆటోమేకర్ తాజాగా పోర్ట్ ఫోలియోలో ఉన్న తమ మోడల్స్ కి సంబంధించి సెప్టెంబర్ నెలలో ఆయా మోడల్స్ సేల్స్ డేటాను కూడా ప్రకటించింది. సెప్టెంబర్-2023కి సంబంధించి మహీంద్రా లైనప్ లో భాగంగా పెట్రోల్ మరియు డీజిల్ విభాగాల్లో 11,846 స్కార్పియో యూనిట్లను విక్రయించింది.
గత సంవత్సరంతో పోల్చి చూస్తే, మహీంద్రా కంపెనీ సరిగ్గా ఇదే సమయానికి 9,536 స్కార్పియో యూనిట్లను విక్రయించింది. దీన్ని ఈ సంవత్సరంతో వృద్ధి రేటుతో పోల్చితే 24.22 శాతంగా ఉంది. ప్రస్తుతం, ఈ బ్రాండ్ నుంచి స్కార్పియో నేమ్ ప్లేట్ తో రెండు మోడల్స్ అమ్ముడవుతున్నాయి. అందులో స్కార్పియో ఎన్ మరియు స్కార్పియో క్లాసిక్ ఉన్నాయి.
ఇతర వార్తలను మీరు గమనిస్తే, మహీంద్రా స్కార్పియో తాజాగా దేశంలో 9 లక్షలకు పైగా యూనిట్లను ఉత్పత్తి చేసి మరో మైలురాయిని చేరుకుంది. ఇది 2002లో లాంచ్ కాగా, మహీంద్రా బ్రాండ్ నుంచి ఎక్కువగా అమ్ముడవుతున్న మోడల్స్ ఒకటిగా నిలిచింది. తాజాగా, స్కార్పియో ఎన్ పై భారీగా రూ.81,000 వరకు ధర పెరిగింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్