- వివిధ బ్రాండ్లపై భారీ డిస్కౌంట్స్ పొందే అవకాశం
- 31 డిసెంబర్ వరకు మాత్రమే అమలులో ఉండనున్న ఆఫర్స్
సెలెక్టెడ్ ఆటోమొబైల్ కంపెనీలు డిసెంబర్ 2023లో తమ ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఈ బెనిఫిట్స్ ని క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్స్ రూపంలో పొందవచ్చు.ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఈ బెనిఫిట్స్ 31 డిసెంబర్ 2023 వరకు మాత్రమే అమలులో ఉంటాయి. ఇప్పుడు మనం వాటికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిద్దాం.
మహీంద్రా ఎక్స్‌యూవీ400పై రూ.4 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది, అదే విధంగా హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారుపై రూ.3 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ లభించనుంది. అలాగే, నెక్సాన్ ఈవీ మ్యాక్స్ యొక్క ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ పై రూ. 2.20 లక్షలు క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభించనుంది.
ఇక టాటా నెక్సాన్ ఈవీప్రైమ్పై ఉన్న డిస్కౌంట్స్ విషయానికి వస్తే రూ. 1.50 లక్షలు క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉన్నాయి. ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్ ఈవీపై కేవలం రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్ మాత్రమే అందుబాటులో ఉంది. అదే విధంగా, ఎంజి జెడ్ఎస్ ఈవీపై రూ. 50,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందించబడుతుంది.
ఇక టాటా టియాగో ఈవీపై ఉన్న డిస్కౌంట్స్ విషయానికి వస్తే, రూ.50,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉన్నాయి. దాని ట్విన్ గా పిలువబడుతున్న సబ్-4 మీటర్ సెడాన్, టిగోర్ ఈవీపై రూ. 50,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్