- ఒకే ఒక్క పవర్ ట్రెయిన్ తో అందించబడుతున్న X-ట్రైల్
- ఆగస్టు 1వ తేదీన ధరల ప్రకటన
నిసాన్ ఇండియా దాని లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ఎస్‍యూవీ అయిన X-ట్రైల్ మోడల్ పై అధికారికంగా బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కస్టమర్లు ఈ మూడు వరుసల ఎస్‍యూవీని 1 లక్ష రూపాయల మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కారు సింగిల్ వేరియంట్ మరియు పెర్ల్ వైట్, డైమండ్ బ్లాక్, మరియు షాంపేన్ సిల్వర్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందించబడనుంది. అదే విధంగా ఈ ఎస్‍యూవీ ధరలను 2024 ఆగస్టు 1వ తేదీన నిసాన్ ఇండియా ప్రకటించనుంది.
నిసాన్ X-ట్రైల్ లోని 1.5-లీటర్ 3-సిలిండర్ విసిటి ఇంజిన్ సివిటి గేర్ బాక్సుతో జతచేయబడింది. ఈ మోటార్ 12V మైల్డ్-హైబ్రిడ్ సిస్టం సహాయంతో 160bhp మరియు 300Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఈ కారు ఈకో, స్టాండర్డ్ మరియు స్పోర్ట్ అనే మూడు డ్రైవ్ మోడ్ లను కలిగి ఉంది.
ఇంటీరియర్ విషయానికి వస్తే, X-ట్రైల్ క్యాబిన్ లుక్స్ మరియు ఫీచర్ల పరంగా చాలా సౌకర్యవంతంగా, గ్రేట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే నిసాన్ కంపెనీ దీనిలో బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ ని అందించింది. ఇంకా ఇందులోని ఫీచర్ల విషయానికి వస్తే, X-ట్రైల్ మోడల్ వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీతో 8-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, ఆటో హోల్డ్ తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, మరియు వైర్ లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లతో రానుంది. ఇంకా చెప్పాలంటే, ఇది లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ తో రానుండగా దీని వెనుక డిజిటల్ ఇంస్ట్రుమెంట్ ప్యానెల్ ఉంటుంది. అదే విధంగా, ఇందులో 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, పనోరమిక్ సన్ రూఫ్, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్, 7 ఎయిర్ బ్యాగ్స్ మరియు మరియు మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకునే విధంగా ఫ్రంట్ సీట్ల వంటి ఇతర ఫీచర్లు అందించబడతాయి.
కాంపీటీషన్(పోటీ) మరియు ధరల పరంగా, నిసాన్ X-ట్రైల్ మోడల్ కంప్లీట్ బిల్ట్ యూనిట్ (సిబియు)గా ఇండియాకు వస్తుండగా, దీని ధర రూ.28 లక్షల నుంచి రూ.32 లక్షల వరకు (ఎక్స్-షోరూం) వరకు ఉండవచ్చని భావిస్తున్నాం. లాంచ్ అయిన తర్వాత, ఈ మోడల్ టయోటా ఫార్చునర్, జీప్ మెరిడియన్, ఎంజి గ్లోస్టర్, హ్యుందాయ్ టక్సన్ కార్లతో, అలాగే మహీంద్రా XUV700 మరియు టాటా సఫారీ కార్లతో కూడా పోటీపడుతుంది.
లేటెస్టుగా కొత్త నిసాన్ X-ట్రైల్ ని మేము డ్రైవ్ చేశాము. దీనికి సంబంధించిన ఫస్ట్ డ్రైవ్ రివ్యూ మా వెబ్ సైట్ మరియు యూట్యూబ్ ఛానెల్ లో అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు దీని ఎక్స్‌పీరియన్స్ మరియు ఫీచర్ల గురించి తెలుసుకోవాలంటే ఆ వీడియోను చూడవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్