ఈ వారం ప్రారంభంలో నిసాన్ కంపెనీ ఇండియా-స్పెక్ X-ట్రైల్ ని ఆవిష్కరించింది. మొదటిసారిగా ఈ మోడల్ 2022లో ప్రదర్శించబడగా, ఈ మూడు-వరుసల ఎస్‍యూవీ తర్వాత మాగ్నైట్ ఫేస్‍లిఫ్ట్, నిసాన్ నుంచి వచ్చిన రెండు-వరుసల మరియు మూడు-వరుసల డస్టర్ మరియు బడ్జెట్ ఈవీ వంటి ఇతర మోడల్స్ కూడా ప్రదర్శించబడ్డాయి. ఇప్పుడు మనం X-ట్రైల్ కారుకు సంబంధించిన ముఖ్యమైన తేదీల వివరాలను తెలుసుకుందాం.
2024 నిసాన్ X-ట్రైల్ బుకింగ్స్ ప్రారంభ తేదీ
నిసాన్ ఇండియా కంపెనీ కొత్త X-ట్రైల్ కారు బుకింగ్స్ ని అధికారికంగా జూలై 26వ తేదీ నుంచి ప్రారంభించనుంది. ముఖ్యంగా, ఈ ఎస్‍యూవీ సింగిల్ వేరియంట్లో మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.
కొత్త నిసాన్ X-ట్రైల్ ని చూపేందుకు అధికారిక బ్యాన్ ని తొలగించు తేదీ
2024X-ట్రైల్ ని లేటెస్టుగా మేము డ్రైవ్ చేశాము, కానీ మా రివ్యూని మీరు చూడాలంటే నిసాన్ విధించిన అధికారిక బ్యాన్ ని తొలగించాలి. ఆ తేదీ వరకు మీరు వేచి ఉండాల్సి ఉంటుంది. జూలై 23వ తేదీన అధికారిక బ్యాన్ ని నిసాన్ కంపెనీ ఎత్తివేయనుంది. దాని తర్వాత ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు మీకు లభిస్తాయి.
నిసాన్ X-ట్రైల్ డీలర్లకు మరియు షోరూంలకు చేరుకునే తేదీ
నిసాన్ కంపెనీ జూలై నెల చివరికల్లా కొత్త X-ట్రైల్ కార్లను డీలర్ల వద్దకు చేరవేయడం ప్రారంభించనుంది. అందువల్ల ఈ కారు ఆగస్టు మొదటి వారంలో లోకల్ డీలర్ షిప్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమవుతుందని భావిస్తున్నాం.
కొత్త X-ట్రైల్ లాంచ్ మరియు ధరల ప్రకటన తేదీ
అదేవిధంగా కారును ఆవిష్కరించిన తర్వాత, నిసాన్ కంపెనీ 2024X-ట్రైల్ మోడల్ ధరలను ఇండియాలో ఆగస్టు 1వ తేదీన వెల్లడించనుంది. అలాగే ఇది ఈ నెలలో మొదటి లాంచ్ కానుండగా, దీని తర్వాత టాటా కర్వ్, లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ, మరియు మెర్సిడెస్-బెంజ్ CLE మరియు GLC కూపే వంటి ఇతర మోడల్స్ కూడా ఉన్నాయి.
2024X-ట్రైల్ డెలివరీ తేదీ
నిసాన్ మూడు-వరుసల ఎస్‍యూవీ X-ట్రైల్ డెలివరీ తేదీని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు కానీ,X-ట్రైల్ మోడల్ కి సంబంధించి 150 యూనిట్లు రవాణాకు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ పేర్కొన్న నంబర్లను బట్టి ధరల ప్రకటన రోజు కాకపోయినా, దాని తర్వాత వీటి డెలివరీ ప్రారంభంకానుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్