- రూ. 6లక్షలు (ఎక్స్-షోరూమ్)తో ప్రారంభంకానున్న ధరలు
- ఇండియాలో మాత్రమే అమ్మకానికి ఉన్న నిస్సాన్ మోడల్
ఇండియాలో విక్రయించబడుతున్న ఏకైక మోడల్, మాగ్నైట్ ఎస్‌యువిపై ధరలను పెంచుతున్నట్లు నిస్సాన్ ఇండియా ప్రకటించింది. జపనీస్ ఆటోమేకర్ సంస్థ జనవరి 2024 నుండి ఎస్యువి యొక్క అన్నివేరియంట్ల పై ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇది ప్రారంభ ధర రూ. 6 లక్షలు (ఎక్స్-షోరూమ్) తో అందుబాటులో ఉంది.
ఆటోమేకర్ ప్రకారంగాచూస్తే, ధరల పెరుగుదలకు కారణం పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు మరియు ద్రవ్యోల్బణం ఒత్తిడి అని ప్రచారం. అయితే, మాగ్నైట్ ఎస్‌యువిని బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు డిసెంబర్ 31, 2023లోపు బుక్ చేసుకుంటే ఇయర్-ఎండ్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది.
నిస్సాన్ మాగ్నైట్ XE, XL, XV, XV ప్రీమియమ్, కురో ఎడిషన్ మరియు గెజా ఎడిషన్‌తో సహా వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మెకానికల్‌గా చూస్తే, కాంపాక్ట్ ఎస్యువి రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. ఇందులో 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ ఉన్నాయి. ట్రాన్స్మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్ ఎఎంటి మరియు సివిటి గేర్‌బాక్స్ ద్వారా నిర్వహించబడతాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప