- అక్టోబర్ 4న లాంచ్
- మైనర్ అప్ డేట్లతో వస్తున్న మాగ్నైట్ ఫేస్‍లిఫ్ట్
నిసాన్ మాగ్నైట్ మొదటిసారిగా ఇండియాలో 2020వ సంవత్సరంలో లాంచ్ అయ్యింది. ఇప్పుడు లేటెస్ట్ ఇటరేషన్ మాగ్నైట్ ఫేస్‍లిఫ్ట్ గా రాబోతుంది. నిసాన్ నుంచి వస్తున్న ఈ అప్ కమింగ్ ఫేస్‍లిఫ్టెడ్ మోడల్ ఇతర మోడళ్ల నుంచి పోటీని తట్టుకునేలా ఎన్నో కాస్మోటిక్ అప్ డేట్లతో మరియు అప్ డేటెడ్ ఫీచర్ అప్ డేట్లతో రాబోతుంది. అక్టోబర్ 4వ తేదీన లాంచ్ కాబోయే రీఫ్రెష్ మోడల్ నుంచి ఏమేం ఆశించవచ్చో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్
మాగ్నైట్ ఫేస్‍లిఫ్ట్ కారు రీఫ్రెష్డ్ స్టైలింగ్ తో వస్తుండగా, ఓవరాల్ గా దాని ఎక్స్‌టీరియర్ డిజైన్ ఒకేలా ఉంటుందని మేము భావిస్తున్నాం. అలాగే, 2024 మాగ్నైట్ కారు కొత్త గ్రిల్, రీడిజైన్డ్ హెడ్ ల్యాంప్ క్లస్టర్స్, ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, రీవర్క్ చేయబడిన బంపర్స్, మరియు 16-ఇంచ్ అల్లాయ్స్ వాటిలో కాస్మోటిక్ అప్ డేట్లతో వస్తుంది. ఇంటీరియర్ పరంగా, లోపల చూస్తే 5-సీటర్ క్రాస్ ఓవర్ క్యాబిన్ లేఅవుట్ మరియు డిజైన్ ఒకేలా ఉంటుండగా, , డ్యాష్ బోర్డులో చిన్న చిన్న మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇంకా, ఇందులో సింగిల్-పేన్ సన్ రూఫ్ మరియు 6 ఎయిర్ బ్యాగ్స్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉండనున్నాయి.
పవర్ ట్రెయిన్
ప్రస్తుతం విక్రయించబడుతున్న మోడల్ లో అందించబడిన ఒకేరకమైన ఇంజిన్లను 2024 మాగ్నైట్ కూడా కొనసాగించనుంది. ఇందులో 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ వంటివి ఉన్నాయి. మొదటి నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఎఎంటితో లభిస్తుండగా, టర్బోఛార్జ్డ్-పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆప్షన్ తో జతచేయబడి లభిస్తుంది.
లాంచ్ మరియు కాంపీటీషన్
మాగ్నైట్ లేటెస్ట్ ఇటరేషన్ ని నిసాన్ కంపెనీ 2024 అక్టోబర్ 4వ తేదీన ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ కొత్త కారు మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా 3XO మరియు త్వరలో లాంచ్ కానున్న స్కోడా కైలాక్ వంటి కాంపాక్ట్ ఎస్‍యూవీలతో పోటీపడుతుంది. అయితే, ఈ కారు కాంపాక్ట్ ఎస్‍యూవీ సెగ్మెంట్లో ప్రధానంగా రెనాల్ట్ కైగర్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, మరియు టాటా పంచ్ వంటి ఎంట్రీ-లెవెల్ కార్లతో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్