- అక్టోబర్ 4వ తేదీన లాంచ్ కానున్న మోడల్
- రివైజ్డ్ ఇంటీరియర్ కూడా లభిస్తుంది
నిస్సాన్ 2024 మాగ్నైట్ మరొక టీజర్‌ను రిలీజ్ చేసింది, అదే సమయంలో కారు అప్‌డేట్ చేయబడిన ఫాసియాను వెల్లడిస్తుంది. అలాగే, కియా సోనెట్ మరియు మహీంద్రా XUV 3XO వంటి వాటికి పోటీగా ఉండే రిఫ్రెష్ చేసిన ఈ సబ్-ఫోర్-మీటర్ ఎస్‍యూవీ అక్టోబర్ 4వ తేదీన ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానుంది.
కొత్త టీజర్‌లో చూసినట్లుగా, మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ కొత్త లుక్ ని పొందుతుంది. ఇప్పుడు వీటిలో కొత్త గ్రిల్, రివైజ్డ్ బంపర్, కొత్త కాంట్రాస్ట్-కలర్ స్కిడ్ ప్లేట్ మరియు ఎల్- షేప్డ్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ ఉన్నాయి. ఇది కొత్త డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, రిఫ్రెష్ చేయబడిన టెయిల్‌లైట్స్ మరియు ట్వీక్ చేయబడిన టెయిల్‌గేట్ ను పొందుతుందని మునుపటి టీజర్‌లలో నిర్ధారించబడింది. అలాగే, ఈ మోడల్ లోపలి భాగం కూడా గణనీయమైన మార్పులను పొందుతుంది, వాటి వివరాలు మా సైట్‌లో ప్రత్యక్షంగా చూడవచ్చు.
నిస్సాన్ పవర్‌ట్రెయిన్ విభాగంలో ఎలాంటి మార్పులు చేయదని భావిస్తున్నారు. అంటే టర్బోచార్జ్డ్ మరియు నేచురల్లీ ఆస్పిరేటెడ్ రూపాల్లో అందించబడే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ క్యారీ ఓవర్ అవుతుంది. ఈ ఇంజన్లు ఐదు-స్పీడ్ మాన్యువల్, సీవీటీ మరియు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్లతో జత చేయబడ్డాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప