- 2020లో లాంచ్ అయినప్పటినుంచి మొదటి ముఖ్యమైన అప్‌డేట్‌ను పొందిన మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్
- వెల్లడైన వివిధ కొత్త డిజైన్స్
నిస్సాన్ కొనుగోలుదారులకు మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ పై ఆసక్తిని పెంచుతూనే ఉంది. ఇండియన్ మార్కెట్లో అక్టోబర్ 4న లాంచ్ కానుండగా , దానికంటే ముందుగా, కార్‌మేకర్ అప్‌డేటెడ్ సబ్-ఫోర్-మీటర్ ఎస్‍యూవీకి సంబంధించిన మరో టీజర్‌ను లేటెస్టుగా రిలీజ్ చేసింది.
ఇక్కడ ఉన్న చిత్రాలలో చూసినట్లుగా, 2024 మాగ్నైట్ కొత్త అల్లాయ్ వీల్ డిజైన్‌తో డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌ను పొందుతుంది. అదనంగా, ఇది అవుట్‌గోయింగ్ కారు వలె అదే ఎల్- షేప్డ్ డీఆర్ఎల్ఎస్ ను కూడా పొందుతుంది. అలాగే, మునుపటి టీజర్ కొత్త గ్రిల్ మరియు ఎల్ఈడీ ఇన్సర్ట్‌లతో ట్వీక్ చేయబడిన టైల్‌లైట్ ఉనికిని నిర్ధారించింది.
లోపలి భాగంలో, ఫేస్‌లిఫ్టెడ్ మాగ్నైట్ రివైజ్డ్ టచ్‌స్క్రీన్ యూనిట్, కొత్త అప్హోల్స్టరీ థీమ్ మరియు మరిన్నింటిని పొందవచ్చని అంచనా. అలాగే, ఈ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు సీవీటీ గేర్‌బాక్స్‌లతో జత చేయబడి 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బో-పెట్రోల్ ఇంజన్‌లను పొందుతుందని భావిస్తున్నాం. లాంచ్ తర్వాత, మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ టాటా నెక్సాన్, రెనాల్ట్ కిగర్, మారుతి బ్రెజా, కియా సోనెట్, మహీంద్రా, XUV 3XO మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లకు గట్టిపోటీని ఇవ్వనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప