- రూ. 5.99 లక్షలతో ధరలు ప్రారంభం
- మెకానికల్‍గా ఎటువంటి మార్పులు లేకుండా వచ్చిన అప్‌డేటెడ్ మాగ్నైట్
నిస్సాన్ ఇండియా అప్‌డేటెడ్ మాగ్నైట్ ధరలను ప్రకటించింది. ధరలు ప్రకటించిన ఒక్క రోజులోనే, కొత్త మాగ్నైట్ ఎస్‌యువి ఇండియా అంతటా ఉన్న డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది. ఈ సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యువి -విసియా, విసియా+, అసెంటా, N-కనెక్టా, టెక్నా మరియు టెక్నా+అనే 6 కొత్త వేరియంట్‌లలో లభిస్తుంది. దీనిని మీరు రూ. 5.99 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో పొందవచ్చు.
కొత్త నిస్సాన్ మాగ్నైట్ 7 మోనోటోన్ మరియు 5 డ్యూయల్-టోన్ కలర్స్ తో కలిపి మొత్తం 12 ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్స్ తో లభిస్తుంది. మోనోటోన్ కలర్స్ విషయానికి వస్తే, అందులో ఫ్లేర్ గార్నెట్ రెడ్, ఒనిక్స్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్, స్టార్మ్ వైట్, పెర్ల్ వైట్, వివిడ్ బ్లూ మరియు సన్‌రైజ్ కాపర్ ఆరెంజ్వంటి కలర్స్ ఉన్నాయి.
ఫీచర్ల విషయానికొస్తే, అప్‌డేట్ చేయబడిన మాగ్నైట్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 8- ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేట్ చేయబడిన యూఐతో 7-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, రిమోట్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌ను పొందింది. అలాగే, బెజెల్-లెస్ ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం, 6 ఎయిర్‌బ్యాగ్స్ మరియు 360-డిగ్రీల సరౌండ్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లను కూడా పొందింది.
మెకానికల్‍గా, మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ అదే 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతోంది. ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్‌తో జతచేయబడినప్పటికీ, మొదటిది ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి అందించబడింది.అంతే కాకుండా, టర్బో-పెట్రోల్ మోటార్ సివిటి యూనిట్‌ను కూడా పొందింది.
అనువాదించిన వారు: రాజపుష్ప