- 2020లో లాంచ్ అయిన తర్వాత మొదటిసారిగా మేజర్ అప్‌డేట్ ను పొందిన మోడల్
- 2025లో రెండు సి-ఎస్‌యువిలు లాంచ్ అయ్యే అవకాశం
నిసాన్ కార్లను ఇష్టపడే వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ అక్టోబర్ 4న ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది 2020లో లాంచ్ అయినప్పటి నుంచి మాగ్నైట్‌కి సంబంధించిన ఎలాంటి ప్రధాన ఫీచర్ల అప్‌డేట్స్ మరియు క్యాబిన్ లో రివైజ్డ్ డిజైన్ ని మరియు మరికొన్ని కొత్త వివరాలను పొందుతుందో ఇక్కడ మనం చూద్దాం.
స్పై షాట్‌లలో చూస్తే, ఈ కారు సరికొత్త లుక్ తో మరియు వెనుక డిజైన్‌తో పాటు టాప్-స్పెక్ మోడల్‌ల కోసం కొత్త అల్లాయ్ వీల్స్‌ను పొందింది. లోపలి భాగంలో అప్హోల్స్టరీలో మార్పులను అలాగే యాంబియంట్ లైటింగ్‌ని మనం ఈ మోడల్ లో చూడవచ్చు. ప్రస్తుతం విక్రయించబడుతున్న మాగ్నైట్ వలె కాకుండా, టాప్-స్పెక్ వెర్షన్‌లు ఇప్పటికే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, పవర్ మిర్రర్స్ మరియు వైర్‌లెస్ ఫోన్ మిర్రరింగ్ వంటి ఫీచర్లతో కలిగి ఉన్నాయి. అలాగే, ఇది కైగర్ కారును పోలి ఉంది.
మాగ్నైట్ 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్‌తో కొనసాగుతుందని మేము భావిస్తున్నాము, ఈ ఇంజిన్ 71bhp/91Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5 -స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్ పొందవచ్చు. అలాగే, మోస్ట్ పవర్ ఫుల్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ కూడా ఉంది. ఇది సివిటి యూనిట్ టైపులో 99bhp/152Nm టార్కును మరియు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్ టైపులో 160Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
కొత్త మాగ్నైట్‌లో మనం చూడబోయే అప్‌డేట్స్ 2025లో ఏదో ఒక సమయంలో కైగర్‌లో కూడా చూడవచ్చని భావిస్తున్నాం. అలాగే, నిస్సాన్ ఇండియాలో X-ట్రైల్ కారును రిఫ్రెష్ చేసి లాంచ్ చేసింది. మొదటగా ఎక్స్-ట్రైల్ ఎస్‌యువిని లాంచ్ చేయగా, మరియు ఇప్పుడు ఈ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ని వచ్చే నెలలో ఇండియన్ మార్కెట్లో తీసుకువస్తుంది. ఇంతేకాకుండా, దాని పీస్ డి రెసిస్టెన్స్ (S) 5 సీట్స్ మరియు 7 సీట్స్ కాన్ఫిగరేషన్‌లతో రెండు కొత్త సి-ఎస్‌యువిలుగా కనిపిస్తుంది. ఇవి ఇండియా-స్పెక్ రెనాల్ట్ డస్టర్ మరియు వచ్చే నెలలో పారిస్‌లో ప్రదర్శించబడే డాసియా బిగ్‌స్టర్ కాన్సెప్ట్ ప్రొడక్షన్-రెడీ వెర్షన్ ఆధారంగా వస్తున్నాయి. ఈ రెండు కొత్త ఎస్‌యువిలు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా మరియు టాటా కర్వ్ వంటి కార్లకు గట్టి పోటీని ఇవ్వనున్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప