- కేవలం రూ. 11,000 టోకెన్ అమౌంట్ తో బుకింగ్స్ ప్రారంభం
- అక్టోబర్ 5 నుండి ప్రారంభంకానున్న డెలివరీలు
నిస్సాన్ ఇండియా దాని బెస్ట్ సెల్లర్ మాగ్నైట్‌ను ఎట్టకేలకు వచ్చే రోజుల్లో అప్‌డేట్ చేస్తుంది. ఇది ఇండియన్ మార్కెట్లో అక్టోబర్ 4వ తేదీన లాంచ్ కి సిద్ధంగా ఉండగా, ఒక రోజు తర్వాత డెలివరీలు ప్రారంభం కానున్నాయి. దీనికి ముందుగానే, ఆటోమేకర్ ఇప్పటికే మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ యొక్క బుకింగ్‌లను ప్రారంభించింది మరియు మొదటిసారిగా ఎస్‌యువి ఇంటీరియర్ టీజ్ చేసింది.
చిత్రంలో చూసినట్లుగా, మాగ్నైట్ దాని ముందున్న మోడల్ నుండి చాలా అంశాలను కలిగి ఉంటుంది. ఇందులో డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ లేఅవుట్, షేప్ మరియు పొజిషనింగ్ లో ఉన్న ఏసీ వెంట్స్ , హెచ్ విఎసి కంట్రోల్ డయల్స్, స్టీరింగ్ వీల్ మరియు డిజిటల్ క్లస్టర్ వంటివి ఉన్నాయి.అలాగే, సీట్ అప్హోల్స్టరీ మరియు క్యాబిన్ థీమ్ టాన్ ఫినిషింగ్‌తో కొత్తగా కనిపిస్తాయి.
ఫీచర్ల విషయానికొస్తే, మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ ఏసీ వెంట్స్ మరియు ముందు ప్రయాణీకుల కోసం సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌తో కొనసాగుతుంది. అయితే, ఇందులో మరో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మాగ్నైట్ సన్‌రూఫ్ ని కూడా పొందుతుంది.
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, కొత్త మాగ్నైట్ అదే 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ తో అందించబడుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప