- మొదటి సారిగా భారీ అప్డేట్ లను పొందిన కాంపాక్ట్ ఎస్యువి
- అందుబాటులో ఉన్న రెండు పవర్‌ట్రెయిన్ మరియు మూడు గేర్‌బాక్స్ ఆప్షన్
నిస్సాన్ 2024 అప్డేటెడ్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ , అక్టోబర్ 4 వ తేదీన ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. దానికంటే ముందుగా ఈ కారు వివరాలను ఫోటోలు ద్వారా ఆటోమేకర్ వెల్లడించింది. ఇక్కడ ఉన్న చిత్రాలలో చూసినట్లుగా, ఇది కొత్త గ్రిల్ మరియు హెడ్‌ల్యాంప్‌లతో కొత్త ఫాసియాను పొందుతుంది. ఈ కారు సరికొత్త లుక్ లో పెద్ద క్రోమ్ ఇన్సర్ట్స్ కూడా కనిపిస్తాయి. అలాగే, టెయిల్ ల్యాంప్స్ డిజైన్‌లో ఎటువంటి మార్పులు లేవని గుర్తించవచ్చు. అంతేకాకుండా, ఈ కారు లోపల భాగం చుస్తే, ఇండివిజువల్ ఎలిమెంట్స్ అంశాలలో రీడిజైన్ చేయబడిన కొత్త మార్పులు ఉన్నాయి.
రియల్ వరల్డ్ ఫోటోలను వెల్లడించిన తర్వాత, అప్ కమింగ్ (రాబోయే) మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో నిర్ధారించబడిన ఫీచర్ లిస్ట్ కి సంబంధించి ,కొత్త సీట్ అప్హోల్స్టరీ, అప్డేటెడ్ స్టీరింగ్ వీల్ మరియు డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్ వంటి ప్రత్యేక అంశాలను నిర్ధారిస్తాయి. ఈ కారు పెద్ద యూఎస్‌లలో ఎయిర్ ఫిల్టర్ సిస్టమ్‌లో ఒకటిగా ఉంటుందని అంచనా వేయబడింది. అలాగే, ఇది రేంజ్ లో స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా అందించబడుతుందని మేము భావిస్తున్నాం.
ఇతర ఫీచర్లలో చూస్తే, 360-డిగ్రీ కెమెరా, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, డ్రైవర్ సీట్ ఎత్తు సర్దుబాటు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ ఏసీ వెంట్స్ తో కూడిన క్లైమేట్ కంట్రోల్, పవర్ మిర్రర్స్ మరియు విండోస్ మరియు వైర్లెస్ ఫోన్ మిర్రరింగ్ వంటివి ఇందులో ఉన్నాయి.
మాగ్నైట్ రెండు 1.0-లీటర్ ఇంజన్లతో కొనసాగుతుందని భావిస్తున్నారు. ఒకటి లోయర్- స్పెక్ 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఇది 71bhp మరియు 96Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ ఎంటి లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్నాయి. మరొకటి 99bhp/160Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మరియు ఈ ఇంజిన్ 6-స్పీడ్ ఎంటి లేదా సీవీటీ మరిన్ని ఆప్షన్ తో లభిస్తుంది.
ఈ కారు లాంచ్ చేసిన దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత అప్డేటెడ్ఫేస్లిఫ్ట్ను పొందింది. ఇది హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజా, మారుతి ఫ్రాంక్స్, టయోటా టైజర్ మరియు రెనాల్ట్ కైగర్ వంటి వాటికి పోటీగా ఉండనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప