- రాబోయే వారాల్లో ధరల ప్రకటన
- దీనితో పాటుగా అందుబాటులో ఉన్న న్యూ కురో ఎడిషన్
ఇటీవలే నిస్సాన్ ఇండియాలో అందరూ కొనుగోలు చేయగలిగిన మాగ్నైట్ ఎఎంటి వెర్షన్‌లను ఆవిష్కరించింది. కాంపాక్ట్ ఎస్‌యూవీని నేచురల్ ఆస్పిరేటేడ్ మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్‍లతో అందించగా,వీటిలో రెండోది మాత్రమే సివిటి యూనిట్‌తో అందుబాటులో ఉంది.
న్యూ వేరియంట్స్ ధరలను ఇంకా ప్రకటించనప్పటికీ, వాహన తయారీ సంస్థ దాని మైలేజ్‍ని ప్రకటించింది. మాగ్నైట్ ఎస్‌యూవీకి సంబంధించి అందుబాటులో ఉన్న అన్ని వేరియంట్స్ మైలేజ్ క్రింది పట్టికలో మీరు చూడవచ్చు.
వేరియంట్స్ | మైలేజ్ (ఏఆర్ఏఐ- క్లెయిమ్) |
1.0-లీటర్ పెట్రోల్ మాన్యువల్ | 19.35కెఎంపిఎల్ |
1.0-లీటర్ పెట్రోల్ఎఎంటి | 19.70కెఎంపిఎల్ |
1.0-లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ | 20కెఎంపిఎల్ |
1.0-లీటర్ టర్బో పెట్రోల్ సివిటి | 17.4కెఎంపిఎల్ |
1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ 71bhp మరియు 96Nm టార్క్‌ను విడుదల చేస్తుంది, అదే విధంగా టర్బో పెట్రోల్ మిల్లు 99bhp మరియు 160Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.
మాగ్నైట్ కురో ఎడిషన్
న్యూ ఎఎంటి గేర్‌బాక్స్‌ను, మాగ్నైట్ న్యూ కురో ఎడిషన్‌లో కూడా కలిగి ఉంటుంది. మాగ్నైట్ కురో ఎక్స్‌టీరియర్ లో భాగమైన ఎలిమెంట్స్ అన్నింటిని బ్లాక్ షేడ్‌లో కలిగి ఉంది, ఇందులో ఉన్నడార్క్ ఫ్రంట్ గ్రిల్, గ్లోస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్స్, బ్లాక్ ఓఆర్‍విఎం మరియు రూఫ్ రెయిల్స్ మరియు మరికొన్ని పూర్తి బ్లాక్ కలర్ ఇంటీరియర్ థీమ్ ను కలిగి ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప