- నాన్-టర్బో వేరియంట్స్ తో వచ్చే అవకాశం
- మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ తో పాటుగా మాగ్నైట్ ఎఎంటి ఆవిష్కరణ
నిసాన్ ఇండియా ఇండియన్ మార్కెట్లో మాగ్నైట్ మోడల్ కి సంబంధించిన ఎఎంటి వేరియంట్ ని ఆవిష్కరించింది. 2020 సంవత్సరం చివరిలో లాంచ్ అయినప్పటినుంచి, మాగ్నైట్ కేవలం సివిటి గేర్ బాక్స్ తో మాత్రమే అందుబాటులో ఉంది. అదే విధంగా ఇది టర్బో పెట్రోల్ ఇంజిన్ కు మాత్రమే పరిమితం చేయబడింది. కానీ, ప్రస్తుత కాలంలో కొనుగోలుదారులు ఎఎంటి ట్రాన్స్‌మిషన్ పై ఎక్కువ ఆసక్తిని చూపడంతో నిసాన్ కంపెనీ మాగ్నైట్ మోడల్ లో అన్నీ 5-వేరియంట్స్ లో ఎఎంటి ట్రాన్స్‌మిషన్ ని తీసుకువచ్చింది.
నిసాన్ మాగ్నైట్ ను రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ తో పొందవచ్చు. మొదటిది, 1.0-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 71bhp మరియు 96Nm టార్క్ ని ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. రెండవది, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 99bhp మరియు 152Nm టార్క్ ని జనరేట్ చేయడానికి ట్యూన్ చేయబడింది. మొదటిది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఎఎంటి యూనిట్‌తో జత చేయబడితే, రెండవది 5-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి యూనిట్‌తో జత చేయబడింది.
మరో వార్తలో చూస్తే, ఈ ఆటోమేకర్ ఎఎంటి వేరియంట్ తో పాటు మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్ ను కూడా ఆవిష్కరించింది. కేవలం XV వేరియంట్‌లో మాత్రమే రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ స్పెషల్ ఎడిషన్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ మరియు ఎక్స్‌టీరియర్ ను పూర్తిగా బ్లాక్ కలర్ లో కలిగి ఉంది. ఆసక్తి గల కస్టమర్స్ రూ. 11,000 టోకెన్ మొత్తంతో క్రాస్‌ఓవర్ కురో ఎడిషన్‌ను బుక్ చేసుకోవచ్చు, డెలివరీలు లాంచ్ అయిన వెంటనే ప్రారంభమవుతాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్