- రూ. 6.50లక్షలతో ప్రారంభంకానున్న మాగ్నైట్ఎఎంటిఎక్స్-షోరూమ్ ధరలు
- ఇటీవలే మాగ్నైట్ కురో ఎడిషన్‌ను ప్రవేశపెట్టిన నిస్సాన్
నిస్సాన్ ఇండియా ఇటీవలే మాగ్నైట్ రేంజ్ లో రెండు అప్‌డేట్‌లను పరిచయం చేసింది. అవి ఏవి అంటే ప్రత్యేక కురో ఎడిషన్ మరియు ఎఎంటి ట్రాన్స్‌మిషన్. మాగ్నైట్ కురో ఎడిషన్ ఆన్-రోడ్ ధరలను మేము కలిగి ఉన్నాము వాటిని మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించి చదువుకోవచ్చు. ఇప్పుడు మనం మాగ్నైట్ ఎఎంటి ధరలను ఒకసారి నిశితంగా పరిశీలిద్దాం.
ఇండియాలోని టాప్ 10 నగరాల్లో మాగ్నైట్ ఎఎంటివేరియంట్ ధరలు (ఆన్-రోడ్)
* పట్టికలో చూపించిన విధంగా పెరిగిన ధరలు *
సిటీ | బేస్ వేరియంట్ (మాగ్నైట్ XE ఎఎంటి) | టాప్ వేరియంట్ (మాగ్నైట్ XV ప్రీమియం ఎఎంటి) |
ముంబై | రూ. 7.62 లక్షలు | రూ. 10.40 లక్షలు |
బెంగళూరు | రూ. 7.81 లక్షలు | రూ. 10.65 లక్షలు |
ఢిల్లీ | రూ. 7.38 లక్షలు | రూ. 10.06 లక్షలు |
హైదరాబాద్ | రూ. 7.80 లక్షలు | రూ. 10.64 లక్షలు |
పూణే | రూ. 7.62 లక్షలు | రూ. 10.40 లక్షలు |
అహ్మదాబాద్ | రూ. 7.19 లక్షలు | రూ. 9.81 లక్షలు |
లక్నో | రూ. 7.40 లక్షలు | రూ. 10.10 లక్షలు |
ఇండోర్ | రూ. 7.40 లక్షలు | రూ. 10.10 లక్షలు |
చెన్నై | రూ. 7.55 లక్షలు | రూ. 10.30 లక్షలు |
కోల్‌కతా | రూ. 7.54 లక్షలు | రూ. 10.29 లక్షలు |
నిస్సాన్ మాగ్నైట్ ఎఎంటి నాలుగు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది - XE, XL, XV మరియు XV ప్రీమియం. 1.0-లీటర్, 3-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో 71bhp మరియు 96Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది ఎఎంటి యూనిట్‌తో పాటు, ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు:రాజపుష్ప