- 10 నవంబర్, 2023 వరకు అమలులో ఉండనున్న ప్రారంభ ధరలు
- 19.70కెఎంపిఎల్ ఏఆర్ఏఐ –క్లెయిమ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీతో వచ్చిన మాగ్నైట్
మొత్తానికి ఎంతగానో ఎదురుచూస్తున్న మాగ్నైట్ ఎఎంటి ధరలను నిస్సాన్ ఇండియా ప్రకటించింది. ఈ క్రాస్ఓవర్‌ను రూ. 6,49,900(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. కానీ, నవంబర్ 10, 2023 వరకు మాత్రమే ఈ ప్రారంభ ధర అమలులో ఉంటుంది . కస్టమర్లు కురో స్పెషల్ ఎడిషన్‌తో పాటు XE, XL, XV మరియు XV ప్రీమియం అనే నాలుగు వేరియంట్‌ల నుండి మాగ్నైట్ ఏఎంటిని ఎంచుకోవచ్చు.
ఈ ట్రాన్స్‌మిషన్ 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను పరిచయం చేయగా , ఇది 71bhp మరియు 96Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సెటప్‌తో, మాగ్నైట్ ఏఆర్ఏఐ ద్వారా ధృవీకరించబడిన 19.70కెఎంపిఎల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుంది.
ఇతర వార్తలలో చూస్తే , ఈఆటోమేకర్ దేశంలో మాగ్నైట్ కురో స్పెషల్ ఎడిషన్‌ను ప్రారంభించగా, దీని ధరలు రూ. 8.27 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ ఎడిషన్ XV వేరియంట్ పై ఆధారపడి ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ రెండింటిని ఆల్-బ్లాక్ ట్రీట్‌మెంట్‌లో రానుంది.
నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవాస్తవ ఈ లాంచ్ గురించి వ్యాఖ్యానిస్తూ, 'నిస్సాన్ మాగ్నైట్ ఒక గేమ్ ఛేంజర్ అని, దాని స్ట్రాంగ్ విలువలతో కూడిన ప్రతిపాదన, అత్యంత మెరుగైన టాప్ సేఫ్టీ రేటింగ్స్ మరియు తక్కువ ఖర్చుతో కూడిన ఓనర్ షిప్ వంటి వాటితో కొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేసింది. ఎస్‍యువి,సెడాన్ మరియు హ్యాచ్‌బ్యాక్ కేటగిరీలలో అత్యంత అందుబాటులో ఉండే విధంగా ఏఎంటి అయిన నిస్సాన్ మాగ్నైట్ EZని చాలా తక్కువ ప్రారంభ ధరతో ఈరోజే ప్రారంభించి ధరలకు సంబంధించిన అన్నీ రికార్డులను బ్రేక్ చేసింది. మరియు ఈ గేమ్ ఛేంజర్ కస్టమర్స్ అభీష్టానికి, సౌకర్యానికి అనుగుణంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉల్లాసవంతమైన, అద్బుతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప