- 2025 ప్రారంభంలో ఇండియాకి వచ్చే అవకాశం
- నిస్సాన్ మోడల్‌కు సమానంగా కొనసాగనున్న ఉత్పత్తి
థర్డ్-జెన్ డస్టర్ గురించి వెల్లడైన సరికొత్త విషయాలు
ఈ వారమే థర్డ్-జెన్ రెనాల్ట్ డస్టర్ 2024 రిలీజ్ చేయబడింది. ఇది రెనాల్ట్ ఇండియా నుంచి వస్తున్న ప్రీమియం ఎస్‍యూవీఛార్జ్ కొత్త వాహనం మరియు నిస్సాన్ కు సరిసమానంగా ఈ మోడల్‌ను నిలుస్తుంది. 2024 చివరలో ఢిల్లీలో జరిగే 2025 ఆటో ఎక్స్‌పోలో ఈ కార్లను ఇండియన్ మార్కెట్ కు పరిచయం చేసి లాంచ్ చేసే అవకాశం ఉంది.ఇది రెనాల్ట్ కొత్త సిఎంఎఫ్-బిగ్లోబల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మార్కెట్లోకి రానుంది.
ఇంజిన్ ఆప్షన్స్ వివరాలు
డీజిల్ ఇంజిన్ ఆప్షన్ అనేది లేకుండా గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చిన మొట్టమొదటి డస్టర్ ఇదే అని చెప్పవచ్చు. కొత్త డస్టర్ గా పిలువబడుతున్న డాసియా ఎస్‍యూవీ 3 ఇంజిన్ ఆప్షన్స్ తో వస్తున్నట్లు రెనాల్ట్ ప్రకటించింది.
మొదటిది 1.6-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ మరియు 2 ఎలక్ట్రిక్ మోటార్స్ తో జతచేయబడింది. కానీ ఇది పూర్తి హైబ్రిడ్ సిస్టమ్ వస్తుంది, ఇది అచ్చం హోండా ఈహెచ్ఈవీసిస్టమ్‌కి సమానంగా ఉండడమే కాకుండా మారుతి సుజుకి మరియు టయోటా కూడా తమ ఎస్‍యూవీలను అందిస్తున్నాయి. ఈ ఇంజన్ ఇది వరకే జాగర్ ఎంపీవీలో అందించబడుతుండగా, ఇది 140bhp/148Nm ఉత్పత్తి చేస్తుంది. అలాగే 24.5kmpl మైలేజీని కూడా ఇస్తుంది.
రెండవది మైల్డ్-హైబ్రిడ్ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ 110bhp-160bhp పవర్ అవుట్ పుట్ ని అందించే48V ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడింది. మొదటిసారిగా డస్టర్ మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ తో కూడిన 4X4 టెక్ పవర్ ట్రెయిన్ ఆప్షన్ ను పొందనుంది. అలాగే ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఏటీని వచ్చే అవకాశం ఉంది. మూడవది అనగా చివరిది, అదే ఇండియాకు రానున్న 3-సిలిండర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్/ఎల్‍పిజి-కంపాటిబుల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్ తో జత చేయబడింది.
పోటీ
రెనాల్ట్-నిస్సాన్ సమూహం నుంచి వస్తున్న నెక్స్ట్-జెన్ రెనాల్ట్ డస్టర్ 2024కు పోటీగా కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్ మరియు ఎంజిఆస్టర్ ఉండనున్నాయి. అలాగే దీని 3-వరుసల మోడల్ కి పోటీగా హ్యుందాయ్ అల్కాజర్, ఎంజిహెక్టర్ ప్లస్, మహీంద్రా స్కార్పియో మరియు మహీంద్రా ఎక్స్‌యువి700 ఉండనున్నాయి.
డస్టర్ మరియు నిస్సాన్ కు ఇండియా ప్రొడక్షన్ మరియు ఎగుమతి కేంద్రంగా ఉంటుందని భావిస్తున్నాము. ఈ రెనాల్ట్-నిస్సాన్ సమూహం ఇండియాలో రైట్ హ్యాండ్ డ్రైవింగ్మరియు రైట్ హ్యాండ్ డ్రైవింగ్మార్కెట్స్ కోసం కార్లను తయారు చేయనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్