- ఇండియాకు ఇది ఫోర్త్-జనరేషన్ స్విఫ్ట్
- 2024లో ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం
2023 జపనీస్ మొబిలిటీ షోలో నెక్స్ట్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ ఆవిష్కరించబడింది. దీని బయటి పైపు మరియు లోపలి వైపు సరికొత్త డిజైన్ ని తీసుకురావడమే కాక, ఇది కొత్త టెక్నాలజీతో అప్ గ్రేడ్ చేయబడింది.
సరికొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్
మారుతి స్విఫ్ట్ నుంచి వచ్చిన చివరి మూడు జనరేషన్స్ తో పోలిస్తే, ఇది స్పోర్ట్స్ లుక్ ని కలిగి ఉండి సరికొత్త డిజైన్ తో రానుంది. దీని ఫేస్ క్రోమ్ గ్రిల్ తో పాటుగా కొత్త గ్రిల్ డిజైన్ ని కలిగి ఉంది. ఓల్డ్ స్విఫ్ట్ లో ఉన్న హారిజాంటల్ స్లాట్స్ తో పోలిస్తే చూడడానికి ఇది చాలా బాగుంది. దీని ప్రొఫైల్ చూస్తే, స్విఫ్ట్ తన సిల్హౌట్ ను అలానే అలానే ఉంచింది. ఇంకా రెండు పెద్ద మార్పుల గురించి చెప్పాలంటే, రెండవ-వరుసలో ఉన్న డోర్ హ్యండిల్స్ మరియు 16-ఇంచ్ యూనిట్స్ లో వీల్స్ ని కొత్తగా డిజైన్ చేసింది. ఈ కొత్త మోడల్ లోని టెయిల్ ల్యాంప్స్ షేప్స్ కూడా బ్లాక్ సరౌండ్, ఫుల్ ఎల్ఈడీ యూనిట్స్ లేఅవుట్ తో కొద్దిగా మార్పులు చోటు చేసుకున్నాయి.
అప్ గ్రేడ్ చేయబడిన క్యాబిన్
ఇందులో క్యాబిన్ కి సంబంధించి పెద్ద మార్పును మేము గమనించాము, కానీ మరిన్ని ఫీచర్స్ ని సుజుకి అప్ గ్రేడ్ చేసింది. ప్రస్తుతం అప్ గ్రేడ్ చేయబడిన ఫీచర్స్ లో ఏవేవి ఉన్నాయి అంటే, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ వీల్, బటన్స్ మరియు టచ్ ప్యానెల్ అదేవిధంగా సెంటర్ కన్సోల్ లో కొత్త డ్యాష్ బోర్డ్, ఏసీ కన్సోల్ మరియు ఇన్ఫోటైన్మెంట్ సిస్టం కోసం 10-ఇంచ్ డిస్ ప్లే ఉన్నాయి.
డిజైన్ లో పెద్దగా మార్పులు చేయకపోయినా, సుజుకి కొత్త ఓఎస్ తో కూడిన ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, లెవెల్ 2 ఏడీఏఎస్, ఫుల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ మరియు మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ తో తన జపనీస్-స్పెక్ కారు ఫీచర్స్ లిస్టును అప్ గ్రేడ్ చేసింది.
కింద హుడ్ లో ఏమున్నాయి ?
ఈ మొబిలిటీ షోలో ప్రదర్శించిన కారు హైబ్రిడ్ మోడల్ కాగా, ఇండియన్ మార్కెట్లోకి వచ్చే మోడల్ 1.2-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటేడ్ మాన్యువల్ తో జత చేయబడి 89bhp/113Nm ఉత్పత్తి చేయనుంది. ఈ ఇంజిన్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ మరియు సిఎన్‍జికి సరిపోయేలా రానున్నట్లు అంచనా, మేము కూడా ఇది భవిష్యత్తులో వస్తున్నట్లు అంచనా వేశాము.
ఇండియాలో లాంచ్, కాంపిటీషన్ మరియు ధరలు
కొత్త ఫోర్త్-జనరేషన్ స్విఫ్ట్ పూర్తిగా తయారై 2024లో ఇండియాలో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రస్తుత వెహికిల్ ని కేవలం ఇండియన్ కస్టమర్స్ కి మాత్రమే కాకుండా వివిధ దేశాల్లోని లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మరియు రైట్ హ్యాండ్ డ్రైవ్ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయనున్నారు. దీనికి పోటీగా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, రెనాల్ట్ ట్రైబర్, సిట్రోన్ C3, టాటా పంచ మరియు హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఉన్నాయి. ప్రస్తుత కారుపై రూ.10,000 నుంచి రూ.30,000 రేంజ్ లో ధర పెరగవచ్చని అంచనా వేస్తున్నాం.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్