- 2026లో ఇండియాకు వస్తుందని అంచనా
- డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్లతో వస్తున్న నెక్స్ట్-జెన్ కంపాస్
జీప్ కంపెనీ దాని నెక్స్ట్-జనరేషన్ కంపాస్ ఎస్‍యువికి సంబంధించి మొట్టమొదటి టీజర్‌ను రిలీజ్ చేసింది. 2026లో ఇతర ప్రొడక్షన్ లొకేషన్లకు వెళ్లే ముందు 2025లో మెల్ఫీలోని ఇటలీ ప్లాంట్‌లో ఈ కారు ప్రొడక్షన్ ప్రారంభమవుతుందని జీప్ కంపెనీ అధికారికంగా తెలిపింది.
టీజర్ ని చూస్తే, ఇది నెక్స్ట్-జెన్ కంపాస్ పూర్తి ప్రొఫైల్‌ను వెల్లడిస్తుంది. అలాగేదీనిని మొదటిసారిగా చూసినట్లయితే ప్రస్తుత మోడల్ కంటే పొడవుగా కనిపిస్తుంది. ఫోటోలలో స్క్వేర్డ్ ఆఫ్ వీల్ ఆర్చ్‌లు, ఫ్లోటింగ్ రూఫ్‌లైన్ మరియు ర్యాప్-అరౌండ్ హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్‌ల్యాంప్స్ కూడా కనిపిస్తాయి. కంపాస్ పొడవుగా ఉన్నట్లయితే, నెక్స్ట్-జనరేషన్ మెరిడియన్ కారు కూడా ప్రస్తుత కారు కంటే ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది.
ఇండియా ఇప్పుడు కంపాస్‌కు రైట్ హ్యాండ్ డ్రైవ్ప్రొడక్షన్ సెంటర్ గా ఉంది. అలాగే, 2026లో ప్రపంచవ్యాప్తంగా ఈ కారు లాంచ్ అయినప్పుడు కొత్త జనరేషన్ కారును పొందే వారిలో మనం కూడా ఒకరిగా ఉంటామని చాలా ఈజీగా చెప్పేయవచ్చు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ఆప్షన్లతో మరియు అప్‌గ్రేడ్ చేయబడిన ఫీచర్ లిస్ట్ వంటి వాటితో రెండింటినీ కలిగి ఉంటుందని మేము భావిస్తున్నాం.
ఇంకా పోటీ విషయానికి వస్తే, ఈ కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా మరియు టాటా హారియర్‌లతో పోటీపడవచ్చని మేము భావిస్తున్నాం. అయితే, వీటితో పాటుగా హ్యుందాయ్ అల్కాజార్, ఎంజిహెక్టర్ ప్లస్ మరియు టాటా సఫారీ మిడ్-లెవెల్ వెర్షన్ కార్లు కూడా కొత్త జనరేషన్ జీప్ కంపాస్ కారుకు పోటీగా ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్