- పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే లభ్యం
- ఇప్పుడు లాంగ్ వీల్ బేస్ తో వచ్చిన 5 సిరీస్ మోడల్
నెక్స్ట్-జనరేషన్ బిఎండబ్లూ 5 సిరీస్ మోడల్ నేడే రూ.72.9 లక్షల ఎక్స్-షోరూం ధరతో ఇండియాలో లాంచ్ అయింది. ఇది ప్రస్తుతం రెండు వేరియంట్లు, రెండు కలర్లు మరియు ఒక పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ తో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా, బిఎండబ్లూ నుంచి మోస్ట్ సక్సెస్ ఫుల్ మిడ్ సైజ్ సెడాన్ 8వ జనరేషన్ లగ్జరీ కారుగా ఈ మోడల్ వచ్చింది. మేము దీనిని డ్రైవ్ చేసిన వీడియో మా వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకువచ్చాము. ఒకసారి మీ ఆ వీడియోను చూసి ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఎక్స్‌టీరియర్ హైలైట్స్
బయటి వైపు చూస్తే, ఈ లేటెస్ట్ జనరేషన్ కొత్త 5 సిరీస్ లగ్జరీ కారు బిఎండబ్లూ అన్ని కార్లలో అందించబడినట్లు సన్నని పూర్తి ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ తో ట్రేడ్ మార్కుతో కూడిన సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్ ని పొందింది. ప్యాకేజీలో భాగంగా బిఎండబ్లూ ఈ కారులో 18-ఇంచ్ మరియు 19-ఇంచ్ వీల్స్ ని అందిస్తుంది. దీని గురించి ఇంకా చెప్పాలంటే, మీరు గమనిస్తే ఈ కారులో అందించబడిన వీల్ బేస్ కారణంగా ప్రస్తుత అవుట్-గోయింగ్ వెర్షన్ కారు కంటే కొంచెం పొడవు ఎక్కువ ఉంటుంది. కారు వెనుక భాగంలో ఇంతకు ముందు వెర్షన్ లోని కారు వెనుక భాగం కొంచెం గుండ్రంగా కనిపిస్తుండగా, ఈ కారు వెనుక భాగం అలా ఉండదు. భారీ బంపర్ తో షార్ప్ లుక్ మరియు సిగ్నేచర్ రాప్-అరౌండ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ని పొందింది.
ఇంటీరియర్ మరియు ఫీచర్ హైలైట్స్
లోపల చూస్తే, న్యూ-జనరేషన్ బిఎండబ్లూ క్యాబిన్ డిజైన్ హైలైట్లలో వన్-పీస్ క్లస్టర్ హౌజింగ్ మరియు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంని కలిగి ఉంది. అదేవిధంగా, భారీ సెంటర్ కన్సోల్ మరియు స్క్రోల్ చేసే విధంగా ఒక చిన్న గుండ్రని వీల్ మరియు గేర్ సెలెక్టర్ మెకానిజంని కూడా కలిగి ఉంది. క్యాబిన్ అంతటా పూర్తి బ్రౌన్ కలర్ ని పొందగా, ఇందులో గ్రే కలర్ సెకండ్ కలర్ గా అందించబడింది. అలాగే ఇందులో యాంబియంట్ లైటింగ్ డీఫాల్ట్ గా అందించబడింది.
లగ్జరీ కారులోని రెండవ వరుస క్యాబిన్ చాలా విశాలంగా ఉండగా, ఇది ప్యాసింజర్ కి సౌకర్యవంతమైన ఫీల్ ని అందిస్తూ సెగ్మెంట్లో బెస్ట్ కారుగా నిలుస్తుంది. అయితే, బిఎండబ్లూ 7 సిరీస్ లో భారీ రియర్ స్క్రీన్ ప్రస్తుత 5 సిరీస్ కారులో మిస్ అయ్యింది.
ఇందులో అందించబడిన టాప్ హైలైట్ ఫీచర్లలో పనోరమిక్ సన్‌రూఫ్, బోవర్స్ మరియు విల్కిన్స్ సౌండ్ సిస్టమ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఇంటీరియర్ కెమెరా, లెదరెట్ అప్హోల్స్టరీ, వైర్‌లెస్ ఛార్జర్ మరియు ఫోన్ మిర్రరింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా మరియు డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటివి ఉండగా, ఆటోమేటిక్ పార్కింగ్ ఫీచర్ కూడా ఉంది.
పవర్ ట్రెయిన్ ఆప్షన్
కొత్త 5-సిరీస్ లగ్జరీ కారు 2.0-లీటర్ 4-సిలిండర్ మోటారు అనే ఒకే ఒక్క పెట్రోల్ ఇంజిన్ తో అందుబాటులోకి రాగా, ఈ మోటారు 256bhp మరియు 400Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో జతచేయబడి రియర్ వీల్స్ కి పవర్ ని అందిస్తుంది. ఈ ఇంజిన్ 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టంని కలిగి ఉండగా, ఈ కారు కేవలం 6.5 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది.
కొత్త న్యూ-జనరేషన్ 5 సిరీస్ మోడల్ అప్ కమింగ్ మెర్సిడెస్-బెంజ్ E-క్లాస్ లాంగ్ వీల్ బేస్ మరియు ఆడి A6 వంటి కార్లతో పోటీపడుతుంది. అలాగే, మెర్సిడెస్ GLC, బిఎండబ్లూ X3, మరియు ఆడి Q5 వంటి ఎస్‍యూవీ కార్ల నుంచి కూడా గట్టిపోటీని ఎదుర్కొంటుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్