- 2024లో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త స్విఫ్ట్
- 2023 జపనీస్ మొబిలిటీ షోలో ప్రదర్శన
కొత్త Z12E ఇంజిన్
గత నెలలో ఎప్పుడైతే నెక్స్ట్-జనరేషన్ స్విఫ్ట్ ఆవిష్కరించడిందో, అప్పుడే మేము దీని కొత్త 3-సిలిండర్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ సివిటితో జతచేయబడి వస్తుందని చెప్పాము. స్విఫ్ట్ జపాన్ లో లాంచ్ అయిన తర్వాత దానికి అనుగుణంగా ఇది మార్కెట్ కండిషన్ ని దృష్టిలో ఉంచుకొని కొత్త Z12E ఇంజిన్ సిరీస్ తో వస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే ఈ ఇంజిన్ ప్రస్తుత K12C 1.2-లీటర్ పెట్రోల్ స్థానంలో రానుంది. వేరియంట్ ని బట్టి, ఈ ఇంజిన్ ఎక్స్‌క్లూజివ్ గా జపనీస్ మార్కెట్లో సివిటితో మరియు ఏడబ్లూడీతో అందించబడుతుంది. అలాగే ఇది ఐఎస్‍జీ తో పనిచేసే స్టార్ట్-స్టాప్ ఫంక్షన్ ని కూడా కలిగి ఉంది. అవుట్ పుట్ గురించి చెప్పాలంటే, మారుతి నుంచి పెద్దగా ఆశించలేము కానీ, ఇంతకు ముందు మేము చెప్పినట్లుగానే 100bhp/150Nm ఉత్పత్తి చేసే అవకాశం ఉంది, ఇది ప్రస్తుతం ఇస్తున్న 89bhp/113Nm తో పోలిస్తే చాలా బెటర్ అని చెప్పవచ్చు.
ఈ ఇంజిన్ ఇండియాలో కూడా రానుందా ?
లాజికల్ గా చెప్పాలంటే, ఈ ఇంజిన్ ను ఇండియాకి తీసుకువస్తే చాలా బాగుంటుంది, ఇప్పుడు మనం అందరం చిన్న ఇంజిన్స్ తో ఎక్కువ అవుట్ పుట్ ఇచ్చే వాటిలోకి మారిపోయాం. అలాగే దీని గురించి ఒక నిజం చెప్పాలంటే 1.2-లీటర్ ఇంజిన్ ను సుజుకి గ్లోబల్ మార్కెట్లలో ఎక్కువగా వినియోగించే కస్టమర్లలో మనమే ఉన్నాం, ఒకే దాని నుండి పోటీగా 5 వేర్వేరు కార్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఒకవేళ ప్రపంచంలో ఎక్కడైనా సరే సుజుకి భారీ ఎత్తున ప్రొడక్షన్ ని ప్రారంభించాలి అని భావిస్తే, అది ఇండియా ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ ఈ ఇంజిన్ ఇండియాకి వస్తే, 1.0-లీటర్ టర్బో లీటర్ డ్యూయల్ జెట్ లాగే దీని కొత్త 1.2-లీటర్ 3-సిలిండర్ ఇంజిన్ ఒకే విధమైన అవుట్ పుట్ ని అందించనుంది.