- మరికొన్ని వారాల్లో కొత్త జనరేషన్ డిజైర్ లాంచ్ అవుతుందని అంచనా
- ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన ఫోర్త్-జనరేషన్ స్విఫ్ట్
న్యూ-జెన్ డిజైర్ ధరలు ప్రకటించడానికి మరికొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉండగా, మారుతి సుజుకి ఈ కారును మరోసారి టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఇంటర్నెట్లో దీనికి సంబంధించిన కొత్త స్పై షాట్స్ చక్కర్లు కొడుతుండగా, ఈ సారి అప్ కమింగ్ (రాబోయే) సబ్-ఫోర్-మీటర్ సెడాన్ కి సంబంధించిన మరిన్ని కొత్త వివరాలు వెల్లడయ్యాయి.
కొత్త స్పై షాట్లను చూస్తూ ఉంటే, కొత్త డిజైర్ కారు ఇంటిగ్రేట్ చేయబడిన లేటెస్ట్ హెడ్ ల్యాంప్స్ సెట్, హారిజాంటల్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కొత్త అల్లాయ్ వీల్స్ సెట్, బ్లైండ్-స్పాట్ మానిటర్స్, మరియు కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ ఎక్స్‌టీరియర్ డిజైన్ హైలైట్లతో రానుంది. అలాగే ఇందులో కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ట్వీక్ చేయబడిన టెయిల్ గేట్, మరియు సెగ్మెంట్-ఫస్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వంటి వాటిని మారుతి అందించే అవకాశం ఉంది.
ఇంటీరియర్ పరంగా, 2024 మారుతి డిజైర్ కారు లోపల చాలా వరకు ప్రస్తుత జనరేషన్ స్విఫ్ట్ కారులో ఉన్న డిజైన్ అంశాలు మరియు ఫీచర్లు అందించబడవచ్చని భావిస్తున్నాం. అందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కొత్త 9-ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ యూనిట్, రియర్ ఏసీవెంట్స్, వైర్‌లెస్ ఛార్జర్, ఓటీఏఅప్‌డేట్స్ మరియు వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లేమరియు ఆండ్రాయిడ్ ఆటోకనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
ఇందులోని పవర్ ట్రెయిన్ ఆప్షన్లను పరిశీలిస్తే, ఆల్-న్యూ డిజైర్ కారు 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్లతో (ఎఎంటి) జతచేయబడిన 1.2-లీటర్, 3-సిలిండర్, Z12E పెట్రోల్ ఇంజిన్ ని పొందే అవకాశం ఉంది. ఇంకా ఈ ఇంజిన్ 80bhp మరియు 112Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే, లాంచ్ సమయానికి లేదా దీని లైఫ్ సైకిల్ పూర్తయ్యేలోపు కొత్త డిజైర్ కారు సిఎన్‍జి వెర్షన్లో కూడా వచ్చే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్