- ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సన్ రూఫ్ తో వస్తున్నట్లు నిర్ధారణ
- నెక్స్ట్-జెన్ స్విఫ్ట్ తో పాటుగా లాంచ్ అవ్వనున్న డిజైర్
మారుతి సుజుకి కంపెనీ తాజాగా నెక్స్ట్-జనరేషన్ స్విఫ్ట్ మరియు కొత్త డిజైర్ అనే రెండు రాబోయే కొత్త మోడల్స్ ని దేశవ్యాప్తంగా టెస్టింగ్ చేస్తూ ఉంది. మరికొన్ని నెలల్లో ఈ రెండు కార్లు లాంచ్ జరగనుండగా, వాటి కంటే ముందుగా అత్యంత ఎత్తులో వీటిపై టెస్టింగ్ జరుగుతుండగా కనిపించాయి.
కొత్త మారుతి డిజైర్ డిజైన్ పరంగా మరియు క్యాబిన్ పరంగా బెస్ట్ అప్‍డేట్స్ మరియు కొత్త ఫీచర్లను పొందనుంది. ఇక్కడ ఫోటోలో చూసినట్లుగా, ఈ కొత్త మోడల్ రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియా, కొత్త గ్రిల్, ట్వీక్డ్ బంపర్స్, స్లీకర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ క్లస్టర్, రీపోజిషన్ చేయబడిన ఫాగ్ ల్యాంప్స్, మరియు వైడర్ బానెట్ ని పొందనుంది.
దీని చుట్టూ చూస్తే, అప్‍డేటెడ్ డిజైర్ ఎక్కువ లేదా తక్కువలో సిల్హౌట్ ని కొనసాగించనుంది. మొత్తానికి ఇది, పూర్తి కొత్త డిజైన్ తో కొత్త అల్లాయ్ వీల్స్ రావచ్చని భావిస్తున్నాం. అలాగే,360-డిగ్రీ సరౌండ్ కెమెరాను ఇందులో అమర్చే విధంగా ఓఆర్‌విఎం మౌంటెడ్ కెమెరాలతో ఈ మోడల్‌ని చూసే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యమైన మార్పుని చూస్తే, ఇండియన్ ఆటోమేకర్ నుంచి వచ్చిన సబ్-4-మీటర్ సెడాన్లో అదనంగా వెల్ కం ఫీచర్ తో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సన్ రూఫ్ ని చూడవచ్చు.
ఇక క్యాబిన్ విషయానికి వస్తే, డిజైర్ ఫేస్‍లిఫ్ట్ ప్రస్తుతం అందిస్తున్న ఇతర మోడల్స్ లాగే ఇది కూడా పూర్తి రివైజ్డ్ క్యాబిన్ ని పొందుతుందని మేము భావిస్తున్నాం. అలాగే ఇది వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ మరియు హెచ్‍విఎసిప్యానెల్, అడ్జస్టబుల్ ఎయిర్‌కాన్ వెంట్స్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు అప్‌డేటెడ్ సీట్ అప్హోల్స్టరీ వంటి ఫీచర్లను పొందనుంది.
ఇప్పుడు, ఆటోమేకర్ న్యూ-జెన్ స్విఫ్ట్ లేదా డిజైర్ కి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుత ఇటరేషన్ మోడల్ 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ మోటార్ కంపెనీ-ఫిట్టెడ్ సిఎన్‍జి కిట్ ఆప్షన్ తో వచ్చింది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్ ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్