- అధికారికంగా ఆగస్టు 2న ఆవిష్కరణ
- 6-స్పీడ్ ఎంటి/ఎటితో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ని పొందే అవకాశం
ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో సిట్రోన్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. తాజాగా సిట్రోన్ కంపెనీకి అంబాసిడర్ గా ఇండియన్ మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని నియమితుడయ్యాడు. లేటెస్టుగా, సిట్రోన్ కంపెనీ బసాల్ట్ కొత్త టీజర్ ని రిలీజ్ చేయగా, అందులో ఈ కొత్త మోడల్ C3 ఎయిర్ క్రాస్ కంటే ఎక్కువగా ఫీచర్లతో మరియు భారీ ఇంటీరియర్ అప్ గ్రేడ్లతో వస్తున్నట్లు వెల్లడైంది. అలాగే, కొత్త టీజర్ ద్వారా బసాల్ట్ కారు షేప్ ని కూడా సిట్రోన్ కంపెనీ అధికారికంగా చూపించింది. ఇంటీరియర్ అప్ గ్రేడ్స్ లో భాగంగా, ఇందులోని ముందు మరియు వెనుక సీట్లలో కూర్చునే ప్యాసింజర్ల హెడ్ రెస్ట్స్ కొరకు సైడ్ సపోర్ట్ అందించబడ్డాయి. ఇందులో భాగంగా, రియర్ ఆర్మ్ రెస్ట్ ఫోన్ హోల్డర్ స్లాట్ ని కూడా పొందుతుంది.
పైన పేర్కొన్న విధంగా, టీజర్లో బసాల్ట్ లుక్ ని మొదటిసారి అధికారికంగా సిట్రోన్ కంపెనీ ప్రదర్శించింది. ఫోటోలలో, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మనం చూడవచ్చు, అప్ గ్రేడ్లలో భాగంగా వీటిని మరికొన్ని రోజుల్లో C3 కారులో కూడా మనం చూసే అవకాశం ఉంది.
సిట్రోన్ కంపెనీ దాని సి-క్యూబ్ ప్రోగ్రాంలో భాగంగా, నాలుగవ మోడల్ అయిన బసాల్ట్ కారును లోకల్ గా తయారుచేస్తుంది. ఫ్రెంచ్ ఆటోమేకర్ దీనిని 109bhp/205Nm టార్కును ఉత్పత్తి చేసే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో అందించనుంది. ఈ ఇంజిన్ ని 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జతచేయబడి పొందవచ్చు.
ప్రధానంగా బసాల్ట్ కారు టాటా కర్వ్ ఐసీఈ వెర్షన్ నుంచి అతిపెద్ద పోటీని ఎదుర్కొనబోతుండగా, దీనితో పాటుగా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, ఎంజి ఆస్టర్, మారుతి గ్రాండ్ విటారా, మరియు టయోటా హైరైడర్ వంటి కార్లతో కూడా పోటీపడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్