- అందుబాటులో ఉన్న10 వేరియంట్స్
- ఇండియాలో ప్రారంభ ధర రూ. 16.19 లక్షలు
టాటా మోటార్స్ గత నెలలో కొత్త హారియర్‌తో పాటు అప్‌డేట్ చేయబడిన సఫారీని దేశం అంతటా లాంచ్ చేసింది. ఈ ఫ్లాగ్‌షిప్ మూడు-వరుసల ఎస్‌యువిని రూ. 16.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు. లాంచ్ తర్వాత, నవంబర్‌లో టాటా సఫారిపై ఉన్న లేటెస్ట్ వెయిటింగ్ పీరియడ్‌ను మేము లిస్ట్ చేసాము. మనం ఇప్పుడు వాటి వివరాలను పరిశీలిద్దాం.
సఫారి ఫేస్‌లిఫ్ట్ స్మార్ట్ (O), ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్+, అడ్వెంచర్+ డార్క్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ డార్క్, అకాంప్లిష్డ్+ డార్క్, అడ్వెంచర్+ A, మరియు అకాంప్లిష్డ్+ అనే 10 వేరియంట్స్ లో, 7 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. కస్టమర్‌లు ఎంచుకున్న వేరియంట్‌పై వెయిటింగ్ పీరియడ్ బుకింగ్ చేసుకున్న రోజు నుండి 4 నుండి 6 వారాల వరకు ఉంటుంది. ఎంచుకున్న ప్రదేశాన్ని బట్టి, అందుబాటులో ఉన్న స్టాక్ మరియు ఇతర అంశాలపై ఆధారపడి ఈ వెయిటింగ్ పీరియడ్ మారే అవకాశం ఉంది.
మెకానికల్‍గా చూస్తే, టాటా సఫారి యొక్క 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జత చేయబడింది. ఈ ఇంజిన్ బిఎస్6 2.0- కంప్లైంట్ కు అనుగుణంగా మరియు 168bhp మరియు 350Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.
అనువాదించిన వారు: రాజపుష్ప