- ఇందులో అందుబాటులో ఉండనున్న కనెక్టింగ్ లైట్ బార్
- రాబోయే మరికొద్ది రోజుల్లో ధరలు ప్రకటన
టాటా మోటార్స్ కంపెనీ దాని హారియర్ మరియు ఫ్లాగ్‌షిప్ ఎస్‍యువి సఫారీ ఫేస్‌లిఫ్ట్ టీజర్స్ ను విడుదల చేసింది. ఈ రెండు వాహనాల అనధికారిక బుకింగ్స్ గత వారంలోనే ప్రారంభమయ్యాయి. కానీ బ్రాండ్ నుంచి అందిన సమాచారం ప్రకారం, దాని అధికారిక బుకింగ్స్ ఈ నెల 6న ప్రారంభంకానున్నాయి. ఈ కొత్త అప్‌డేట్‌లో, హారియర్ మరియు సఫారి యొక్క ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ రెండూ అప్‌డేట్ చేయబడ్డాయి. ఇవి ఈ రెండింటికి కొత్త లుక్ ని ఇవ్వనున్నాయి.
హ్యారియర్ ఫేస్‌లిఫ్ట్‌లో వస్తున్న కొత్త అప్‌డేట్స్
ఇక్కడ ఉన్న ఫోటోలను పరిశీలిస్తే, ఈ ఎస్‍యువి షేప్ ని గమనిస్తే చాలా వంపులు తిరిగి చూపరులను ఆకట్టుకునేలా ఉంది. అలాగే, ఇది కనెక్టెడ్ లైట్ బార్ డిజైన్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ను కలిగి ఉంది. స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్ మరియు రీడిజైన్ చేయబడిన బంపర్‌తో గ్రిల్‌ను కలిగి ఉంది.
ఫీచర్స్ గురించి చెప్పాలంటే, హారియర్ ఫేస్‌లిఫ్ట్‌లో దాదాపు 12.3-ఇంచ్ పెద్ద టచ్‌స్క్రీన్, సెంటర్ కన్సోల్ కూడా రీడిజైన్ చేయబడి ఉంది. అలాగే ఇది టాటా ఇల్యూమినేటెడ్ లోగో, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్-బేస్డ్ హెచ్‍విఎసి కంట్రోల్స్ తో పాటు 2-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంది. దీనితో పాటు ఇందులో వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, కొత్త గేర్ లీవర్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, బ్లైండ్ స్పాట్ మానిటర్ సిస్టమ్ మరియు ఎయిడ్స్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉండనున్నాయి.
ఇంజన్ గురించి చెప్పాలంటే, హారియర్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇప్పటికే ఉన్న ఆప్షన్స్ కు కొత్తగా 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ జత చేయవచ్చు.
టాటా సఫారీలో వస్తున్న కొత్త అప్‌డేట్స్
ఈ మూడు-వరుసల ఎస్‍యువిబ్లాక్ యాక్సెంట్‌లతో కొత్త బ్రాంజ్ షేడ్‌లో అందించబడుతుంది. చిత్రాల ప్రకారంగా, సఫారీ బ్రాంజ్ షేడెడ్ వర్టికల్ స్లాట్‌లతో కూడిన కొత్త క్లోజ్డ్ ప్యాటర్న్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. దీని ఫ్రంట్ బంపర్ రీడిజైన్ తో రానుంది, ఇందులో స్ప్లిట్ ఎల్ఈడీహెడ్‌ల్యాంప్ సెటప్ ఉండనుంది.
ఇవే కాకుండా, దీని ముందు భాగంలో టాటా లోగో క్రింద పార్కింగ్ కెమెరా, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో కూడిన బానెట్ లైన్ క్రింద వైడ్ లైట్ బార్ మరియు ముందు భాగంలో పార్కింగ్ సెన్సార్లు ఇందులో అందించబడతాయి.
అయితే, ఈ టీజర్‌లో సఫారీ ఇంటీరియర్ ను రివీల్ చేయలేదు. అయినప్పటికీ, హారియర్ లాగానే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్‌పై ఇల్యుమినేటెడ్ టాటా లోగో వంటి ఫీచర్లను కలిగి ఉంటుందని మేము భావిస్తున్నాము. ఈ అప్‌డేటెడ్ టాటా ఎస్‍యువిఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు ఏడీఏఎస్ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.
కొత్త సఫారీలో ఇంజిన్ లో పెద్దగా మార్పు ఉండదని భావిస్తున్నాము. బహుశా ఇది కొత్త ఇంజన్ ఆప్షన్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్‌తో అందించబడవచ్చు. ఆటో ఎక్స్‌పో 2023లో టాటా దీనిని ప్రదర్శించింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్