- అడల్ట్ మరియు చైల్డ్ ఆక్యుపెన్సీలో 5-స్టార్ రేటింగ్ దీని సొంతం
- 6-ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్‍సి, ఐసోఫిక్స్, 360-డిగ్రీ కెమెరా మరియు మరెన్నో ఫీచర్లను పొందిన కొత్త మోడల్
కొత్త టాటా నెక్సాన్ లో సేఫ్టీ రేటింగ్స్ ని పెంచుతూ ఇండియన్ ఆటోమేకర్ గ్లోబల్ ఎన్ క్యాప్ టెస్టులలో 5-స్టార్ రేటింగ్ ని పొందింది. దీంతో, నెక్సాన్ సేఫ్ కాంపాక్ట్ ఎస్‍యూవీ కేటగిరీలో ఒకానొక అద్బుతమైన ప్రీ-ఫేస్‍లిఫ్ట్ గా కొనసాగుతూ 5-స్టార్ రేటింగ్ ని పొందింది.
కొత్త మరియు పటిష్టమైన భద్రతా నిబంధనలతో, టాటా నెక్సాన్ పెద్దలు మరియు పిల్లల ఆక్యుపెన్సీ రక్షణ కోసం వరుసగా 34 పాయింట్లకు 32.22 మరియు 49కి 44.52 పాయింట్లను సాధించింది. SUV ఫ్రంట్, సైడ్ మరియు సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌లకు తగిన రక్షణను అందిస్తుందని పరీక్షల్లో వెల్లడైంది.
కొత్త సేఫ్టీ పరికరాల పరంగా చూస్తే, టాటా నెక్సాన్ మోడల్ అడల్ట్ మరియు చైల్డ్ ఆక్యుపెన్సీ ప్రొటెక్షన్ లో వరుసగా 34 పాయింట్లకు గాను 32.22 పాయింట్లు మరియు 49 పాయింట్లకు గాను 44.52 పాయింట్లు పొందింది. ముందుగా ప్రొటెక్షన్ పరంగా చెప్పాలంటే, ఈ ఎస్‍యూవీ ప్రొటెక్షన్లో చాలా ముందు వరుసలో ఉండడంతో పాటుగా, సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్టులలో మెరుగ్గా ఉందని నిరూపితమైంది.
తాజాగా, ఇండియన్ ఆటోమేకర్ నుంచి వచ్చిన టాటా సఫారీ మరియు హారియర్ మోడల్స్ సేఫ్ కార్లుగా నిలిచినట్లు గ్లోబల్ ఎన్ క్యాప్ ప్రకటించింది. వాటి తర్వాత ఇప్పుడు, నెక్సాన్ రెండవ స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఇది పెడెస్ట్రియన్ ప్రొటెక్షన్లో UN127 మరియు GTR9 లను చేరువయింది.
ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, కొత్త టాటా నెక్సాన్ లో ఈఎస్‍సి, ఈబీడీతో ఏబీఎస్, సీట్‌బెల్ట్ రిమైండర్స్ మరియు ఐసోఫిక్స్ మౌంట్స్ స్టాండర్డ్ గా ఉండనున్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇదిబ్లైండ్ వ్యూ మానిటర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ కంట్రోల్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, మరియు కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఫాగ్ ల్యాంప్స్ ని కూడా పొందింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్