- అందుబాటులో ఉన్నరెండు పవర్‌ట్రెయిన్ఆప్షన్స్
- ప్రారంభ ధర రూ.8.10 లక్షలు
టాటా మోటార్స్ ఇటీవల దేశంలో తమ అత్యంత విజయవంతమైన ఉత్పత్తులలో ఒకటైన నెక్సాన్ ఎస్‌యూవీ ధరలను ప్రకటించింది. సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యూవీ 11 వేరియంట్స్ లో. ప్రారంభ ధర రూ. 8.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో అందుబాటులో ఉంది. లాంచ్ తర్వాత, ఇండియన్ అటోమేకర్అప్ డేటెడ్ నెక్సాన్ ఎస్‌యూవీ యొక్క ఏఆర్ఏఐద్వారా– ధృవీకరించబడిన ఫ్యూయల్ ఎఫిషియన్సీని వెల్లడించింది.
న్యూ నెక్సాన్ బిఎస్6 2.0- అప్ డేటెడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ లో పొందవచ్చు . అవి ఏంటి అంటే 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, ఏఎంటి మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ తో జత చేయబడింది. అదే విధంగా , ఆయిల్ బర్నర్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఒక ఏఎంటి యూనిట్‌తో బండిల్ చేయబడింది.
న్యూ నెక్సాన్ ఎస్‌యూవీ పవర్‌ట్రెయిన్ వారీగా ఏఆర్ఏఐ -క్లెయిమ్ చేసిన మైలేజీ క్రింద పట్టికలో ఇవ్వబడింది .
ఇంజిన్ | ట్రాన్స్‌మిషన్ | ఫ్యూయల్ ఎఫిషియన్సీ వివరాలు |
1.2-లీటర్ టర్బో పెట్రోల్ఇంజిన్ | 5-స్పీడ్ /6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ | 17.44కెఎంపిఎల్ |
1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ | 6-స్పీడ్ ఏఎంటి యూనిట్ | 17.44 కెఎంపిఎల్ |
1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ | 7-స్పీడ్ డిసిటి యూనిట్ | 17.18 కెఎంపిఎల్ |
1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ | 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్ | 23.23 కెఎంపిఎల్ |
1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ | 6-స్పీడ్ ఏఎంటి యూనిట్ | 24.08 కెఎంపిఎల్ |
ఫీచర్ల విషయానికొస్తే, నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ పెద్ద 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బిల్ట్-ఇన్ నావిగేషన్ సపోర్ట్‌తో కూడిన ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో కూడిన ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్-బేస్డ్ హెచ్‍విఏసి కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఇందులో, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జర్, టిపిఎంఎస్ మరియు 360-డిగ్రీ సరౌండ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప