- 2023 అక్టోబర్, 6న బుకింగ్స్ ఓపెన్
- మెకానికల్‍గా ఎలాంటి మార్పులు లేకుండా వచ్చే అవకాశం
టాటా మోటార్స్ నుంచి రాబోయే ఎస్‌యూవీ, హారియర్ ఫేస్‌లిఫ్ట్ యొక్క మరో టీజర్‌ను విడుదల చేసింది. ఈ సమయంలో, వాహన తయారీ సంస్థ రెండు వరుసల ఎస్‌యూవీ ఇంటీరియర్ పార్ట్శ్ ని రివీల్ చేసింది. న్యూ హారియర్ బుకింగ్స్ అక్టోబర్ 6న 2023 నుండి ప్రారంభం కానున్నాయి.
చిత్రంలో చూపించిన విధంగా, హారియర్ ఇటీవలే ప్రారంభించిన నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ లాగే పెద్ద (12.5ఇంచ్ ) టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అలాగే, స్టీరింగ్ వీల్ ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో టూ-స్పోక్ డిజైన్‌ను పొందుతుంది. అంతేకాకుండా, ఎస్‌యూవీ అప్ డేటెడ్ ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది.
ఇతర ఇంటీరియర్ హైలైట్‌లలో యాంబియంట్ లైటింగ్, ఆటో-డిమ్మింగ్ఐఆర్ విఎం, టచ్-ఆధారిత హెచ్ విఏసి కంట్రోల్స్, కొత్త గేర్ లీవర్‌తో రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు 360-డిగ్రీ సరౌండ్ కెమెరా ఉన్నాయి. అదే విధంగా పనోరమిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు ఏడిఏఎస్ టెక్ వంటి ఫీచర్స్ కూడా ఆఫర్‌లో ఉంటాయి.
మెకానికల్‍గా, హారియర్ ఎస్‌యూవీ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడి అదే 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ ద్వారా పవర్ ని పొందడం కొనసాగుతుంది. ఈ మోటార్ బిఎస్6 ఫేజ్ 2-కంప్లైంట్ మరియు 168bhp మరియు 350Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.
అనువాదించిన వారు:రాజపుష్ప