- ఐసీఈ పవర్డ్ కర్వ్ కారులో కూడా లభించనున్న కొత్త ఫీచర్
- ఆగస్టు 7వ తేదీన టాటా ఎలక్ట్రిక్ డెరివేటివ్ లాంచ్
ఇది కేవలం మరొక రోజు మాత్రమే, పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే, వచ్చే వారంలో టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ కానుండగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మేము కలిగి ఉన్నాము. అయితే, గత కొన్ని వారాలుగా కర్వ్ ఎలక్ట్రిక్ మరియు ఐసీఈ వెర్షన్లకు సంబంధించి టాటా కంపెనీ వివిధ కొత్త టీజర్లను రిలీజ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా లేటెస్ట్ టీజర్ ని టాటా రిలీజ్ చేయగా, అందులో కూపే-ఎస్‍యూవీలో ఒక ముఖ్యమైన ఫీచర్ తో వస్తున్నట్లు వెల్లడైంది. కర్వ్ ఈవీ ధరలను ఆగస్టు 7వ తేదీన టాటా బ్రాండ్ ప్రకటించనుంది.
ఇక్కడ టీజర్లలో చూసిన విధంగా, కొత్త కర్వ్ ఈవీ పనోరమిక్ సన్ రూఫ్ తో రానుంది. ఇంటీరియర్ సెక్షన్ ఇరువైపులా డ్యూయల్-పేన్ యూనిట్ యాంబియంట్ లైటింగ్ ఫీచర్ తో రానుంది. టీజర్లో కనిపిస్తున్న ముఖ్యమైన అంశాలలో ఫోర్-స్పోక్ డ్యూయల్-టోన్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, బ్లాక్ మరియు బీజ్ ఇంటీరియర్ థీమ్, ఏసీ ఫంక్షన్లను ఆపరేట్ చేయడానికి టచ్ కంట్రోల్స్, క్రోమ్ డోర్ హ్యండిల్స్, మరియు ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం వంటి ఫీచర్లు ఉన్నాయి.
అంతే కాకుండా, కర్వ్ లోని ఎలక్ట్రిక్ మరియు ఐసీఈ వెర్షన్ కార్లు ఆల్-ఎల్ఈడీ లైటింగ్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, స్లోపింగ్ రూఫ్‌లైన్, ఎల్ఈడీ లైట్ బార్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్)సూట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు కొత్త 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లతో రానున్నాయి.
బానెట్ కింద, 2024 టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ప్యాక్ లతో రానుంది. నెక్సాన్ లోని టాప్-ఎండ్ వేరియంట్లలో అందించబడిన 40.5kWh బ్యాటరీ ప్యాక్ ని తీసుకువస్తుండగా, చిన్న బ్యాటరీ ప్యాక్ గా ఈ కారులో వచ్చే అవకాశం ఉంది. ఇంకో బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఏంటి అంటే, ఇందులో సింగిల్ ఎలక్ట్రిక్ మోటారు 55kWh బ్యాటరీ ప్యాక్ తో జతచేయబడి వస్తుంది. ఇంకా, ఈ కారు డ్రైవింగ్ రేంజ్ విషయానికి వస్తే, సింగిల్ ఫుల్ చార్జ్ ద్వారా 600 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుందని కార్ మేకర్ టాటా పేర్కొంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్