- ఇండియాలో వచ్చే నెలలో వెల్లడికానున్న ఆల్ట్రోజ్ రేసర్ ధరలు
- మరింత పవర్ ఫుల్ 118bhp టర్బో-పెట్రోల్ ఇంజిన్ ని పొందనున్న కొత్త మోడల్
వచ్చే నెలలో టాటా కంపెనీ ఆల్ట్రోజ్ రేసర్ ని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుండగా, దాని కంటే ముందుగా టాటా మోటార్స్ ఈ మోడల్ కి సంబంధించిన మరొక టీజర్ ని రిలీజ్ చేసింది. కొత్త టీజర్ ద్వారా కీలకమైన డిజైన్ ఎలిమెంట్స్ మరియు స్పోర్టియర్ ప్రీమియం హ్యచ్ బ్యాక్ యొక్క ముఖ్యమైన ఫీచర్ వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు ఈ టీజర్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది.
టీజర్ ప్రకారం, 2024ఆల్ట్రోజ్ రేసర్ కాంట్రాస్టింగ్ బ్లాక్ రూఫ్ తో కొత్త ఆరెంజ్ కలర్ ను హైలైట్ చేస్తూ రానుంది. పిల్లర్స్ పై, రియర్ డోర్ హ్యండిల్స్, బానెట్, షోల్డర్ లైన్ పై కూడా బ్లాక్డ్-అవుట్ ట్రీట్ మెంట్ తో రానుంది. అలాగే బానెట్ మరియు రూఫ్ వరకు పొడవుగా డ్యూయల్ వైట్ స్ట్రిప్స్ లైన్లను కలిగి ఉండి, రేసింగ్ ఫ్లాగ్ థీమ్ తో ఇవి ఫినిషింగ్ ని పొందుతాయి. ఇంకా చెప్పాలంటే, ఇది షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు ఫ్రంట్ ఫెండర్ పై ‘Racer’ బ్యాడ్జింగ్ ని పొందనుంది.
కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ లో అతి ముఖ్యమైన ఫీచర్ ఏంటి అంటే, ఈ కారు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తో రానుంది. ఇంకా ఈ స్పోర్టియర్ కారు ఇంటీరియర్ గురించి చెప్పాలంటే, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ మరియు గేర్ లీవర్ మరియు ఇతర అంశాలపై ఆరెంజ్ ఇన్సర్ట్ లను పొందనుంది. మరీ ముఖ్యంగా, ఇందులో గుర్తించాల్సిన ఇతత ఫీచర్లలో 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్ యూనిట్, కొత్త గ్రాఫిక్స్ తో రివైజ్డ్ డిజిటల్ క్లస్టర్, వైర్ లెస్ చార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
బానెట్ కింద, కొత్త ఆల్ట్రోజ్ రేసర్ లో లభించే 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో జతచేయబడి 118bhp మరియు 170Nm టార్కును ఉత్పత్తి చేయనుంది. లాంచ్ అయిన తర్వాత, టాటా ఆల్ట్రోజ్ రేసర్ హ్యుందాయ్ i20 N లైన్ వంటి మోడల్స్ తో పోటీపడే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్