- మార్చి-2025లో లాంచ్ అవ్వనున్న కొత్త స్కోడా
- బ్రెజా, నెక్సాన్, సోనెట్, వెన్యూ, ఇతర కార్లతో పోటీ
ఈ నెల ప్రారంభంలో, స్కోడా ఇండియన్ మార్కెట్లో కొత్త ఎస్‍యూవీని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తుందనే విషయాన్ని నిర్దారించింది. 2025 ప్రథమార్థంలో అందుబాటులోకి రానుండగా, ఈ సబ్-4-మీటర్ ఎస్‍యూవ బ్రాండ్ ఎంక్యూబీ-ఏఓ-ఐఎన్ ప్లాట్‌ఫారమ్ అధారంగా రానుంది. ఇప్పటివరకు ఈ కారు గురించి మనకు తెలిసిన అంశాలు ఏమేం ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.
స్కోడా తెలిపిన వివరాల ప్రకారం, చెక్ కార్‌మేకర్ నుండి వచ్చిన కొత్త సబ్-ఫోర్-మీటర్ ఎస్‍యూవీఇండియాలో డెవలప్ చేయబడి తయారుచేయబడుతుంది. కొత్త స్కోడా కారు లాంటి చిన్న కార్లకు గవర్నమెంట్ ట్యాక్స్ శ్లాబు కింద బెనిఫిట్స్ అందిస్తుంది మరియు ధరల విషయానికి వస్తే ఈ ఎక్సైజ్ బెనిఫిట్స్ కస్టమర్లకు అందజేయబడతాయి.
స్కోడా ప్రకారం, ఈ సబ్-4-మీటర్ ఎస్‍యూవీ, 2026 నాటికి ఇండియాలో స్కోడా కంపెనీ 1 లక్ష కార్ల వార్షిక అమ్మకాల లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడుతుంది. ఇంకా, ఈ కొత్త స్కోడా మోడల్ 5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండి 2030 నాటికి ఇండియాలో ఫోక్స్‌వ్యాగన్ ఫ్యామిలీ యొక్క లక్ష్యానికి కూడా దోహదపడుతుంది.
స్కోడా కంపెనీ ఈ రాబోయే ఎస్‍యూవీకి ఇంకా పేరును ఫైనలైజ్ చేయలేదు మరియు చాలా సందర్భాలలో, 'నేమ్ యువర్ స్కోడా' ప్రచారంతో కస్టమర్లు మరియు అభిమానులను దీనికి పేరు పెట్టడానికి నేరుగా పాల్గొనేలా ఒక కార్యక్రమాన్ని సెలెక్ట్ చేసింది. క్విక్, కారిక్, కైరోక్, కైమాక్ మరియు కైలాక్ తో సహా ఐదు పేర్లను కంపెనీ షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ మోడల్, పైన పేర్కొన్న పేర్లు సూచించినట్లుగా, దాని ఎస్‍యూవీ రేంజ్ కి అనుగుణంగా, ప్రస్తుతం కుషాక్ మరియు కోడియాక్‌ల పేర్లు కలిసే లాగా ఈ ఎస్‍యూవీ రేంజ్ కి, కె లెటర్ తో ప్రారంభమై మరియు క్యూ లెటర్ తో ముగిసే పేరును కలిగి ఉండేటట్లు ప్లాన్ చేస్తుంది.
లాంచ్ అయిన తర్వాత, స్కోడా సబ్-4-మీటర్ ఎస్‍యూవీతో పోటీ పడటానికి పెద్ద సంఖ్యలో పోటీదారులుగా భావిస్తున్న వారి లిస్టు ఉంది. అవి ఏవేవి అంటే, మారుతి బ్రెజా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా XUV300 (ఫేస్‌లిఫ్ట్ అవతార్), నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కైగర్.