- 2025లో లాంచ్ కానున్న స్కోడా సబ్-ఫోర్ మీటర్ ఎస్‍యూవీ
- కుషాక్కంటే తక్కువలో రానున్న కొత్త స్కోడా
స్కోడా ఇండియా పెట్రోల్‌తో నడిచే కొత్త సబ్-ఫోర్ మీటర్ ఎస్‍యూవీని వచ్చే ఏడాది లాంచ్ చేయడానికి ప్లాన్ చేసింది. ఇది ఇండియాలో న్యూ ఆల్-ఎలక్ట్రిక్ఎస్‍యూవీతో పాటు లాంచ్ కానుండగా, దీని ఆటోమేకర్ ఈ కార్ మోడల్ పేరును ఇంకా వెల్లడించలేదు, కాకపోతే, దీని బ్రాండ్ తన ఎస్‍యూవీకి కైలాక్, కైమాక్, కైరోక్, కారిక్ మరియు క్విక్ ఈ 5 పేర్లలో ఏదో ఒక పేరు పెట్టాలని కోరింది.
రాబోయే స్కోడా ఎస్‍యూవీ దాని ప్రస్తుత మోడల్స్, కుషాక్ మరియు స్లావియాతో పంచుకుంటుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో కూడిన 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో అమర్చబడి ఉంటుంది. అలాగే, ఆటోమేకర్ ప్రకారం, దీనినిహ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ వినియోగదారులను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని తీసుకువస్తుంది.
దీని వివరాలను వెల్లడిస్తున్నప్పుడు,కార్‌మేకర్ ఎస్‍యూవీ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్‌ను టీజ్ చేయగా, ఇది ఎల్ఈడీ డిఆర్ఎల్స్ తో కూడిన స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ డిజైన్, రిడ్జ్‌లతో కూడిన పొడవైన బోనెట్, చంకీ వీల్ ఆర్చెస్ మరియు రూఫ్ రెయిల్స్ ను కలిగి ఉంది.
ఈ న్యూ స్కోడా ఎస్‍యూవీ కుషాక్ క్రింది స్థానంలో ఉండగా, ఇది టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మరియు మహీంద్రా ఎక్స్‌యువి300 సెగ్మెంట్‌లోని ఇతర సబ్-ఫోర్ మీటర్ ఎస్‍యూవీలకు పోటీగా ఉంటుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప