- టాటా నెక్సాన్ మరియు కియా సోనెట్‌లకు పోటీగా ఉండనున్న మోడల్
- ఇండియాలో అత్యంత చవకగా లభించనున్న స్కోడా కైలాక్
స్కోడా ఇండియా వచ్చే ఏడాది ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లో కొత్త సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యువిని పరిచయం చేయనుంది. దీని ధరను ప్రకటించడానికి ముందే, ఆటోమేకర్ ఈ కారుని 2024న నవంబర్ 6వ తేదీన ఇండియాలో ఆవిష్కరించబడుతుందని నిర్ధారించింది.
స్కోడా కైలాక్ 1.0-లీటర్, మూడు-సిలిండర్, టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజిన్ బెల్టింగ్ 114bhp మరియు 178Nm టార్క్‌తో మాత్రమే అందించబడుతుంది. అలాగే, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ విషయానికొస్తే, ఇందులో 6 -స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్స్ ఉంటాయి. ఇది మారుతి బ్రెజా మహీంద్రా XUV 3XO, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, రెనాల్ట్ కైగర్మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లకు పోటీగా ఉండనుంది.
ముందు భాగంలో డిజైన్ పరంగా చూస్తే, కైలాక్ లో సన్నని ఎల్ఈడీ డిఆర్ఎల్స్, కొత్త గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, రూఫ్-రైల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, ర్యాప్‌రౌండ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, ముందు మరియు వెనుక భాగంలో కొత్త బంపర్స్ సెట్‌ను పొందుతుంది. లోపలి భాగంలో, ఈ మోడల్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీ, వర్చువల్ కాక్‌పిట్, లెథెరెట్ సీట్స్ మరియు మరిన్ని ఫీచర్స్ ను పొందుతుందని భావిస్తున్నాం.
అనువాదించిన వారు: రాజపుష్ప