- వచ్చే సంవత్సరం ప్రారంభంలో వస్తున్న ఫ్లాగ్ షిప్ స్కోడా ఎస్‍యూవీ
- అక్టోబర్-2023లో సెకండ్-జనరేషన్ ఇటరేషన్
ఇండియాలో కొత్త స్కోడా కొడియాక్ మరోసారి టెస్టింగ్ చేస్తూ కనిపించింది. వచ్చే సంవత్సరం ప్రారంభంలో స్కోడా 2025 కొడియాక్ ధరలను ప్రకటించనుండగా, దాని కంటే ముందు ఇండియన్ మార్కెట్లో రానున్న సెకండ్-జనరేషన్ ఎస్‍యూవీ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ లీకయ్యాయి.
ఇక్కడ అందించబడిన ఫోటోలను గమనిస్తే, స్కోడా కొడియాక్ కారు వెనుక భాగంలో విండ్ షీల్డ్ పై అధికారిక స్టిక్కర్ ని కలిగి ఉంది. ఈ స్టిక్కర్ ని పరిశీలిస్తే, ఈ కారులోని 2.0-లీటర్, ఫోర్-సిలిండర్, టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సుతో జతచేయబడి రానుంది. ఈ ఇంజిన్ ప్రస్తుత కండీషన్ లో 187bhpమరియు 320Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఇక్కడ జరుగుతున్న టెస్టింగ్ లో స్పోర్ట్ లైన్ వేరియంట్ యూనిట్ ని ఉపయోగిస్తున్నారు. అంటే, ఈ కారు వివిధ వేరియంట్లలో అందించబడుతుందని చిన్న క్లూ కూడా మనకు లభించింది.
ఎక్స్‌టీరియర్ పరంగా, 2025 స్కోడా కొడియాక్ బయటి వైపు పూర్తిగా కొత్త డిజైన్ తో పొందింది. అంతేకాకుండా, ఈ కారు కొత్త స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, నిలువుగా అమర్చబడిన స్లాట్‌లతో సిగ్నేచర్ స్కోడా గ్రిల్, ఫ్రెష్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, కొత్త సెట్ అల్లాయ్ వీల్స్, సి-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు, కొత్త టెయిల్‌గేట్ మరియు బ్లాక్-అవుట్ ఓఆర్‌విఎంస్ వంటి ఫీచర్లను పొందుతుంది.
ఇంకా, ఎస్‍యూవీ ఇంటీరియర్ విషయానికి వస్తే, డ్యూయల్-టోన్ బ్లాక్ మరియు బ్రౌన్ థీమ్ గా రానుండగా, ఇందులో 13-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 10-ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎడాస్ (ఏడీఏఎస్) సూట్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, మరియు టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుందని అంచనా వేస్తున్నాం.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్