- నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం
- కేవలం హైబ్రిడ్ టెక్‌తో పెట్రోల్ తో- మాత్రమే రాబోతున్న ఎస్‌యువి
నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేయనున్న న్యూ రెనాల్ట్ డస్టర్, అప్‌డేటెడ్ మోడల్ కి సంబంధించి అధికారిక ఫోటోలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.
న్యూ రెనాల్ట్ డస్టర్: డిజైన్ అప్‌డేట్స్
చిత్రాలలో చూసినట్లుగా, డస్టర్ వై- షేప్డ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్ తో రివైజ్ చేయబడిన ఫ్రంట్ ఫాసియా మరియు స్క్వేర్ ఎలిమెంట్స్‌తో స్లీకర్ గ్రిల్‌ను పొందుతుంది. అంతేకాకుండా, చంకీ స్కిడ్ ప్లేట్‌తో పాటు స్క్వేర్డ్ వీల్ ఆర్చ్‌లు మరియు కొత్త అల్లాయ్ వీల్స్ ఈ ఎస్‌యువి లో తాజాగా కనిపించానున్నాయి.
న్యూ డస్టర్ వెనుక భాగంలో కూడా వై-షేప్డ్ టెయిల్ ల్యాంప్స్ పొందిఉంది. సిల్వర్ స్కిడ్ ప్లేట్లు వెనుక బంపర్‌పై ప్రత్యేకతను చాటుతున్నాయి మరియు స్పాయిలర్ పూర్తిగా సరికొత్త రూపాన్ని పొందింది.
గ్లోబల్-స్పెక్ డస్టర్ దాదాపు మూడు పెట్రోల్ ఇంజిన్‌లతో అందించబడుతుంది.ఈ బ్రాండ్ ఎస్‌యువి లో బలమైన హైబ్రిడ్ టెక్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది మరియు ఈ ప్రక్రియలో డీజిల్ పవర్‌ట్రెయిన్‌లను దాటవేస్తుంది.
ఇండియాలో న్యూ రెనాల్ట్ డస్టర్ లాంచ్
న్యూ డస్టర్ 2024 లేదా 2025లో ఎప్పుడైనా ఇండియన్ మార్కెట్ చేరుకుంటుందని మేము ఆశిస్తున్నాము. లాంచ్ అయినా తర్వాత, ఈ రెనాల్ట్ ఎస్‌యువి మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు ఎంజి ఆస్టర్‌లతో కలిసి పోటీపడుతోంది.
అనువాదించిన వారు: రాజపుష్ప