- 2024 X-ట్రైల్ ఈ నెలలో లాంచ్ అయ్యే అవకాశం
- పనోరమిక్ సన్‌రూఫ్ తో రానున్న నిస్సాన్ X-ట్రైల్
నిస్సాన్ ఇండియా X-ట్రైల్ ని మరికొన్ని వారాలలో లాంచ్ చేయనుండగా, దానికంటే ముందుగా ఇప్పుడు మరొక టీజర్ వీడియోను రిలీజ్ చేసింది. అప్‌డేటెడ్ మూడు-వరుసల ఎస్‌యువి మొదటిసారిగా నవంబర్- 2022లో ఇండియాలో ప్రదర్శించబడింది.
కొత్త టీజర్ వీడియో ప్రకారం, 2024X-ట్రైల్ లో పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు పూర్తి డిజిటల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే, ఇది ఏడీఏఎస్(ఎడాస్) సూట్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, డ్రైవ్ మోడ్స్ మరియు సెంటర్ కన్సోల్‌లో కప్ హోల్డర్‌లను కలిగి ఉంటుంది.
సిబియు రూట్ ద్వారా ఇండియాకి చేరుకోవడానికి సిద్ధంగా ఉండగా, కొత్తX-ట్రైల్ సివిటి గేర్‌బాక్స్‌తో జత చేయబడిన 1.5-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ని పొందుతుంది. కాకపోతే, స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్‌ను నిస్సాన్ అందిస్తుందా ? లేదా హైబ్రిడ్ యూనిట్‌తో అందిస్తుందా ? అనేది చూడాలి. అలాగే, లాంచ్ అయిన తర్వాత, X-ట్రైల్ మోడల్ బివైడి అట్టో3, ఎంజి క్లౌడ్ ఈవీ, ఫోక్స్‌వ్యాగన్ టైగున్ మరియు జీప్ కంపాస్ వంటి వాటికి పోటీగా ఉండనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప