- రూ. 9.99 లక్షలతో ధరలు ప్రారంభం
- 4 కలర్స్ మరియు 3 వేరియంట్‌లలో అందించబడుతున్న మోడల్
ఈరోజు ఉదయం, జెఎస్ డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా విండ్‍సర్ ఈవీ అనే కొత్త క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్ (సీయూవీ)ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. బ్రాండ్ నుంచి ఇండియాలో అడుగుపెట్టిన మూడవ ఎలక్ట్రిక్ కారు అయిన విండ్‍సర్ ఈవీ రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలతో అందుబాటులో ఉంది. ఈ కారు ముఖ్యమైన టైమ్‌లైన్‌లను ఇప్పుడు మనం నిశితంగా పరిశీలిద్దాం.
టెస్ట్ డ్రైవ్స్
ఈ రేంజ్‌లో కామెట్ కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న విండ్‍సర్ ఈవీ మరికొన్ని రోజుల్లో షోరూమ్‌లకు చేరుకోనుంది. తర్వాత సెప్టెంబర్ నెల 25వ తేదీ నుంచి మొదలు(కిక్‌స్టార్ట్) పెట్టడానికిషెడ్యూల్ చేయబడిన టెస్ట్ డ్రైవ్స్ జరగనున్నాయి.
బుకింగ్ తేదీ
2024 విండ్‍సర్ ఈవీ బుకింగ్‌లు అక్టోబర్ నెల 3వ తేదీన ప్రారంభంకానున్నాయి. అది కూడా నవరాత్రి ప్రారంభం అయ్యే రోజున. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ కారు 3 వేరియంట్స్ మరియు 4 కలర్స్ లో అందుబాటులో ఉంది. మేము దీనిని గూర్చిన మరిన్ని వివరాలను ఇంతకు ముందే వివరించాము మీరు మా వెబ్‌సైట్‌లో దాని గురించి చదువుకోవచ్చు.
డెలివరీ
విండ్‍సర్ ఈవీ బుకింగ్స్ అక్టోబర్ నెలలో ప్రారంభమైన వెంటనే, దాని తర్వాత, అక్టోబర్ నెల 12వ తేదీ నుంచి డెలివరీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది ఈ సంవత్సరం దసరా పండుగ రోజున ప్రారంభం కానుంది.
జెఎస్ డబ్ల్యూ ఈవీ విండ్‍సర్ ఈవీ ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేసిన 38kWh బ్యాటరీ ప్యాక్ ను పొందింది. ఈ మోటార్ 134bhp మరియు 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. అలాగే, ఈ మోడల్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, సుమారు 331కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప