- మెర్సిడెజ్ నుంచి ఈ సంవత్సరం ఇదే చివరి లాంచ్
- 3 వేరియంట్స్ అందుబాటులోకి వచ్చిన రీఫ్రెష్డ్ జీఎల్ఈ
మెర్సిడెజ్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి నేడే రెండు కొత్త మోడల్స్ ను రిలీజ్ చేసింది. ఒకటి జీఎల్ఈ ఫేస్‍లిఫ్ట్ కాగా మరొకటి C43 ఎఎంజి 4మాటిక్. ఈ ఈవెంట్ తో 2023లో ఈ బ్రాండ్ నుంచి వస్తున్న లాంచ్ లకు తెరపడింది. ఈ రెండింటి బుకింగ్స్ నవంబర్ చివరి వారంలో ప్రారంభంకానున్నాయి.
జీఎల్ఈ ఫేస్‍లిఫ్ట్ గురించి చెప్పాలంటే, ఈ మోడల్ 3 వేరియంట్స్ లో అందుబాటులోకి వచ్చింది. అవి ఏవి అంటే, 330d, 450, మరియు 450d (న్యూ). ఇంకా ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, కొత్త జీఎల్ఈలో ట్వీక్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్ తో కూడిన కొత్త సెట్, కొత్త డిజైన్ తో అల్లాయ్ వీల్స్, ఎస్-క్లాస్ ఇంస్పైర్డ్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, కొత్త ఎంబియుఎక్స్ ఇంటర్ఫేస్ తో కూడిన అప్ డేటెడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం లాంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. అదే విధంగా అప్ డేటెడ్ ఎస్‍యూవీ లోపల మరియు బయట సరికొత్త డిజైన్ ట్వీక్స్ మరియు ఫీచర్లను కూడా కలిగి ఉంది.
ఈ 3 వేరియంట్స్ పవర్డ్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్, 3.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్ తో అందుబాటులో వచ్చాయి. ఇందులో ఉన్న అన్నీ ఇంజిన్స్ 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టంతో వచ్చే అవకాశం ఉంది. పవర్ అవుట్ పుట్ పరంగా చూస్తే, 4-సిలిండర్ 300d ఇంజిన్ 265bhp మరియు 550Nm టార్కును ఉత్పత్తి చేయనుండగా, 6-సిలిండర్ 450d ఇంజిన్ 362bhp 750Nm టార్కును ఉత్పత్తి చేయనుంది. అదే విధంగా 6-సిలిండర్ 450 గ్యాసోలిన్ ఇంజిన్ 376bhp మరియు 500Nm టార్కును ఉత్పత్తి చేయనుంది.
ఇక వేరే కార్లతో పోటీ విషయానికి వస్తే, జీఎల్ఈ ఫేస్‍లిఫ్ట్ ఎస్‍యూవీ బీఎండబ్ల్యూ X5, ఆడి Q8, వోల్వో XC90, రేంజ్ రోవర్ వేలార్, మరియు లెక్సస్ ఆర్ఎక్స్ వంటి ప్రీమియం కార్లతో పోటీ పడనుంది. ఇంకో విషయం ఏంటి అంటే, ఈ అప్ డేటెడ్ ఎస్‍యూవీని సేఫ్టీ రేటింగ్స్ కోసం మెర్సిడెస్-బెంజ్ ఇంకా టెస్ట్ చేయలేదు.
మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధరలు
మెర్సిడెజ్ బెంజ్ 300d 4మాటిక్- రూ. 96.4 లక్షలు
మెర్సిడెజ్ బెంజ్ 400d 4మాటిక్- రూ. 1.1 కోట్లు
మెర్సిడెజ్ బెంజ్ 450 4మాటిక్- రూ. 1.15 కోట్లు
అనువాదించిన వారు: సంజయ్ కుమార్