- 2023 ఏప్రిల్ లో వెల్లడైన సిక్స్త్ – జెన్ E-క్లాస్
- ఈ ఏడాది చివర్లో ఎల్‌డబ్ల్యూబీ రూపంలో ప్రవేశం
మెర్సిడెస్-బెంజ్ గత ఏడాది ఏప్రిల్‌లో దాని సిక్స్త్– జెన్ E-క్లాస్ ను ఆవిష్కరించింది. కార్‌మేకర్ ఈ నెక్స్ట్-జెన్ సెడాన్ ఎల్‌డబ్ల్యుబి వెర్షన్‌ను ప్రస్తుత సంవత్సరం చివర్లో ఇండియన్ మార్కెట్‌లో పరిచయం చేయనుంది.
దీని ధరను ప్రకటించడానికి ముందే, పూణేలోని చకన్ మెర్సిడెస్-బెంజ్ ఫ్యాక్టరీలో 2024 E-క్లాస్ పూర్తిగా ఎవరూ ఊహించని రీతిలో కనిపించింది. ఈ ప్లాంటులో రెండు యూనిట్లు, ఒక్కొక్కటి బ్లాక్ మరియు సిల్వర్ రంగులో, యార్డ్‌లో పార్క్ చేయబడ్డాయి.
డిజైన్ పరంగా చూస్తే, న్యూ E-క్లాస్ క్రోమ్ సరౌండ్ మరియు ఇన్సర్ట్‌లతో కూడిన న్యూ సింగిల్-స్లాట్ గ్రిల్, న్యూ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, పెద్ద ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్‌లైట్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ మరియు డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది.
న్యూ-జెన్మెర్సిడెస్-బెంజ్ E-క్లాస్ లోపలి భాగంలో ఎంబీయూఎక్స్ సూపర్‌స్క్రీన్, లెవల్ 4 ఏడీఏఎస్ (ఎడాస్) సూట్, డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీ, యాక్టివ్ యాంబియంట్ లైటింగ్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు బర్మెస్టర్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా, సిక్స్త్ – జెన్ E-క్లాస్ 6 పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. ఇండియా-స్పెక్ కారు మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో జత చేయబడిన 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లతో వచ్చే అవకాశం ఉంది. లాంచ్ అయిన తర్వాత, ఈ లగ్జరీ సెడాన్ బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ మరియు ఆడి A6 లకు పోటీగా ఉండనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప