- న్యూ బిఎండబ్ల్యూ 5 సిరీస్‌కు పోటీగా ఉన్న మెర్సిడెస్-బెంజ్ E-క్లాస్
- ప్రత్యేకంగా ఇండియన్ మార్కెట్లో మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఎల్‌డబ్లూబి రైట్ హ్యాండ్ డ్రైవ్ (ఆర్ హెచ్ డి) వెర్షన్
మెర్సిడెస్-బెంజ్ ఇండియా న్యూ -జనరేషన్ E-క్లాస్ ను అధికారికంగా నేడే ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. దీనిని రూ.78.5 లక్షల (ఎక్స్-షోరూమ్)ధరతో పొందవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే, ఇండియన్ మార్కెట్లో మాత్రమే ఈ ఎల్‌డబ్లూబి ఫారమ్ మరియు రైట్ హ్యాండ్ డ్రైవ్ (ఆర్ హెచ్ డి)ఫార్మాట్‌లో సిక్స్త్ – జనరేషన్ కారు అందుబాటులోకి వచ్చింది.
పవర్‌ట్రెయిన్స్ మరియు పోటీ
పవర్ ట్రెయిన్ల పరంగా కొత్త E-క్లాస్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయబడి వచ్చాయి. అలాగే, ఇందులో అన్నీ ఇంజిన్‌లతో 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ గా లభిస్తుంది. మరోవైపు, పోటీ విషయానికి వస్తే, న్యూ E-క్లాస్ లగ్జరీ కారు బిఎండబ్ల్యూ 5 సిరీస్ మరియు ఆడి A6 వంటి కార్లకు గట్టి పోటీని ఇస్తుంది.
ఎక్స్‌టీరియర్ మరియు కలర్స్
బయటి వైపు, 2024 E-క్లాస్ కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, త్రీ-పాయింటెడ్ స్టార్ డిజైన్‌తో సరికొత్త గ్రిల్, 3-డీ స్టార్ డిజైన్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ మరియు 18-ఇంచ్ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను పొందింది. కలర్స్ విషయానికొస్తే, కస్టమర్లు, ఈ కారును హై టెక్ సిల్వర్, గ్రాఫైట్ గ్రే, పోలార్ వైట్, అబ్సిడియన్ బ్లాక్ మరియు నాటిక్ బ్లూ అనే 5 కలర్స్ నుండి ఎంచుకోవచ్చు.
ఇంటీరియర్ డిజైన్
న్యూ మెర్సిడెస్-బెంజ్ E-క్లాస్ ఇంటీరియర్ లో 14.4-ఇంచ్ టచ్‌స్క్రీన్ యూనిట్, పూర్తిగా డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సరికొత్త ఎంబియుఎక్స్ సిస్టమ్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ వెంట్ కంట్రోల్ మరియు రియర్ సీట్ రిక్లైన్ ఫంక్షన్ తో పాటుగా మరిన్ని అంశాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇది 64-కలర్ యాంబియంట్ లైటింగ్, రెండవ వరుసలో ఎలక్ట్రిక్ బ్లైండ్స్, పనోరమిక్ సన్‌రూఫ్, అన్ని డోర్‌లకు పవర్ క్లోజింగ్ ఫంక్షన్ మరియు బర్మెస్టర్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్ వంటి వాటిని పొందింది.
ముఖ్యంగా, ఈ కారు డ్యాష్‌బోర్డ్ పై కార్‌మేకర్ పొడుగైన సిగ్నేచర్ హైపర్‌స్క్రీన్ ని అందించింది. ఇందులో ఇది అతి పెద్ద హైలైట్ అని చెప్పవచ్చు.
వేరియంట్ వారీగా సిక్స్త్– జనరేషన్ E-క్లాస్ (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
న్యూ E-క్లాస్ E200: రూ. 78.50 లక్షలు
న్యూ E-క్లాస్ E220d: రూ. 81.50 లక్షలు
న్యూ E-క్లాస్ E450 : రూ.92.50 లక్షలు
అనువాదించిన వారు: రాజపుష్ప