- మే 9న లాంచ్ కాబోతున్న కొత్త స్విఫ్ట్
- 5 వేరియంట్లలో అందించబడే అవకాశం
ఫోర్త్ జనరేషన్ మారుతి సుజుకి కంపెనీ కొత్త స్విఫ్ట్ మోడల్ ని ఇదే వారంలో లాంచ్ చేయనుంది. ఈ మోడల్ అధికారిక లాంచ్ కి ముందు, వేరియంట్లు, కలర్లు, మైలేజీ, ఇంజిన్ ఆప్షన్లు మరియు కొన్ని కీలక ఫీచర్లకు సంబంధించిన కీలక వివరాలను మేము పొందాము. ఇప్పుడు, మేము కొత్త స్విఫ్ట్ VXi వేరియంట్ మొదటి రియల్ లైఫ్ ఫోటోలను మీకోసం ఎక్స్‌క్లూజివ్ గా తీసుకువస్తున్నాము.
కొత్త మారుతి స్విఫ్ట్ LXi, VXi, VXi (O), ZXi, మరియు ZXi+ అనే ఐదు వేరియంట్లలో అందించబడనుంది. బేస్ వేరియంట్ నుంచి చూస్తే VXi వేరియంట్ దాని తర్వాత వేరియంట్ గా అందించాబడుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. డిజైన్ పరంగా, VXi వేరియంట్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, బ్లాక్-అవుట్ గ్రిల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి వాటిని పొందనుంది. అదే విధంగా, ఇది ఫాగ్ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్, రియర్ వైపర్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు షార్క్ ఫిన్ యాంటెన్నాను వంటి వాటిని ఇందులో మిస్ అయింది.
ఫీచర్ల పరంగా చూస్తే, కొత్త స్విఫ్ట్ 9-ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్ మరియు టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటి బెస్ట్ ఫీచర్లను పొందింది.
ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త స్విఫ్ట్ 1.5-లీటర్ Z సిరీస్ ఎన్ఎ పెట్రోల్ మోటారు 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ మోటార్ 80bhp మరియు 112Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది. అంతేకాకుండా, కొత్త స్విఫ్ట్ ఏఆర్ఏఐ ద్వారా క్లెయిమ్ చేయబడిన 25.72కెఎంపిఎల్ మైలేజీని అందిస్తుందని మారుతి కంపెనీ పేర్కొంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్