- వచ్చే నెలలో ఈ మోడల్ ని పరిచయం చేయనున్న మారుతి
- దీని తర్వాత లాంచ్ కానున్న 2024 మారుతి డిజైర్
మారుతి సుజుకి ఫోర్త్-జెన్ స్విఫ్ట్‌ను మే 2024లో ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. దీని ధర ప్రకటించడానికి ముందే, సెలెక్ట్చేసిన డీలర్స్ వద్ద 2024 స్విఫ్ట్ అనధికారిక బుకింగ్స్ కూడా ప్రారంభమైనట్లు కార్వాలే తెలుసుకుంది.
కస్టమర్లు కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్‌ను రూ. 11,000 అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఇందులోLXi, VXi, ZXi మరియు ZXi+తో సహా వేరియంట్ రేంజ్ మారకుండా ఉంటుందని మేము భావిస్తున్నాము. కలర్ ఆప్షన్స్ పరంగా ఇది బ్లూ, రెడ్, వైట్, సిల్వర్, బ్లాక్ మరియు ఆరెంజ్ కలర్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
డిజైన్ పరంగా చూస్తే, 2024 స్విఫ్ట్ న్యూ ఫ్రంట్, రియర్ బంపర్స్, న్యూ గ్రిల్ డిజైన్, ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్ తో కూడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, మరియు న్యూ అల్లాయ్ వీల్స్, వెనుక వైపర్ వాషర్ మరియు షార్క్-ఫిన్ యాంటెన్నాను పొందుతుందని అంచనా. ప్రస్తుత ఇటరేషన్ లో సి-పిల్లర్‌పై అమర్చబడిన రియర్ డోర్ హ్యాండిల్స్, నెక్స్ట్- జెన్ కారులోని డోర్స్ యథాస్థానానికి మళ్ళీ చేరుకుంటాయి.
లాంచ్ కానున్న (అప్‌కమింగ్) స్విఫ్ట్ 1.2-లీటర్ Z12E పెట్రోల్ ఇంజిన్‌తో గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉంది. మారుతి ఈ కొత్త పవర్‌ట్రెయిన్‌ను ఇండియాలో ప్రవేశపెడుతుందా లేదా ప్రస్తుతం అందించబడుతున్న 1.2-లీటర్ K12C మోటార్‌తో స్విఫ్ట్ వస్తుందా అనేది ఇప్పటి వరకు అస్పష్టంగానే ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప