- 9 మే, 2024న లాంచ్ కాబోతున్న కొత్త స్విఫ్ట్
- కొత్త VXi (O) వేరియంట్ ని పొందనున్న నయా మోడల్
మారుతి సుజుకి కంపెనీ త్వరలో అనగా 9 మే, 2024న దేశవ్యాప్తంగా న్యూ-జెన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ఇండియన్ కస్టమర్లకు పరిచయం చేయనుంది. అప్‍డేటెడ్ మోడల్ ఐదు వేరియంట్లు మరియు తొమ్మిది కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది. ఈ కొత్త స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ అప్‍డేటెడ్ డిజైన్‌తో పాటు, మరింత ఫీచర్-రిచ్‌గా ఎన్నో ఫీచర్లతో వస్తుంది ఉంటుంది. అంతే కాకుండా కొత్త ఇంజిన్ ద్వారా మెరుగైన పెర్ఫార్మెన్స్ ని అందిస్తుంది. ఆసక్తి కలిగిన కస్టమర్లు కొత్త స్విఫ్ట్‌ను రూ. 11,000 టోకెన్ మొత్తం చెల్లించి ప్రీ-బుక్ చేసుకోవచ్చు.
పాపులర్ మారుతి హ్యాచ్‌బ్యాక్ LXi, VXi, VXi (O), ZXi మరియు ZXi+ అనే ఐదు వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. వీటిలో, ఇప్పుడు VXi (O) ఒకకొత్త వేరియంట్‌గా వస్తుంది. కలర్ ఆప్షన్ల విషయానికొస్తే, స్విఫ్ట్ తొమ్మిది కలర్లలో అందించబడుతుండగా, అందులోలస్ట్రే బ్లూ మరియు నావెల్ ఆరెంజ్ అనే రెండు కొత్త కలర్లు కూడా ఉన్నాయి.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే, అప్‍డేటెడ్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ 9-ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జర్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్ (స్టాండర్డ్), ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, రియర్ ఏసీ వెంట్స్, టైప్-సిఛార్జింగ్ పోర్ట్ మరియు ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ వంటి కొత్త ఫీచర్లను కలిగి ఉంది.
పవర్‌ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, కొత్త-జెన్ మారుతి స్విఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా అందించబడిన కొత్త 1.0-లీటర్ మూడు-సిలిండర్ Z సిరీస్ ఇంజిన్ ని ఇండియాలో కూడా తీసుకువచ్చింది. ఈ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడి 80bhp వరకు పవర్ అవుట్‌పుట్ మరియు 112Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్