- ఇండియాలో రేపే 2024 స్విఫ్ట్ ధరలు వెల్లడి
- కొత్త 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందనున్న నయా మోడల్
ఈ వారంలో కొత్త స్విఫ్ట్ ధరను మారుతి వెల్లడించనుండగా, దాని కంటే ముందుగా మారుతి స్విఫ్ట్ దేశవ్యాప్తంగా ఉన్న లోకల్ డీలర్ షిప్స్ వద్దకు చేరుకోవడం కొనసాగుతుంది. ఇంటర్నెట్లో దర్శనమిచ్చిన కొత్త ఫోటోలను చూస్తే,VXi వేరియంట్ రెడ్ కలర్ ఫినిషింగ్ తో కనిపించింది.
కొత్త మారుతి స్విఫ్ట్ మొత్తం 9 కలర్లలో అందుబాటులోకి రానుండగా, అందులో నావెల్ ఆరెంజ్ మరియు లస్ట్రే బ్లూ అనే రెండు కొత్త కలర్లు కూడా ఉన్నాయి. లీకైన ఫోటోలను చూస్తే వైట్, సిల్వర్, మరియు ఇప్పుడు రెడ్ మూడు అనే మూడు అదనపు కలర్లలో వస్తున్నట్లు వెల్లడవుతుంది. కస్టమర్లు ఈ మోడల్ ని LXi, VXi, VXi (O), ZXi, and ZXi+ అనే ఐదు వేరియంట్ల నుండి ఎంచుకునే అవకాశం ఉంది.
ఇక్కడ ఫోటోలలో చూస్తే, 2024 స్విఫ్ట్ VXi వేరియంట్ ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, కొత్త బ్లాక్డ్-అవుట్ గ్రిల్, వీల్ కవర్లు లేకుండా స్టీల్ వీల్స్, కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, బ్లాక్డ్-అవుట్ పిల్లర్స్, బాడీ-కలర్డ్ ఓఆర్‍విఎం మరియు ,డోర్ హ్యండిల్స్, మరియు సి-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్ ఇన్సర్ట్స్ పొందింది.
ఇంటీరియర్ పరంగా, రాబోయే (అప్ కమింగ్) స్విఫ్ట్ VXi వేరియంట్ లోపలి భాగంలో స్టీరింగ్ వీల్, 7-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, కొత్త ఏసీ వెంట్స్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్, మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటిని పొందుతుంది. అలాగే ఇది 6-ఎయిర్ బ్యాగ్స్ తో అందించబడనుంది. ఇంజిన్ విషయానికి వస్తే, బానెట్ కింద ఈ మోడల్ కొత్త 1.2-లీటర్, 3-సిలిండర్, జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ రానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా కార్ వాలే వెబ్ సైట్ ని సందర్శించి తెలుసుకోగలరు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్