- మే 9న ఇండియాలో లాంచ్ కానున్న న్యూ మారుతి స్విఫ్ట్
- హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతుందని అంచనా
ఇండియాలో టెస్టింగ్
మే 9న ఇండియా అంతటా ఎంతగానో ఎదురుచూస్తున్న, న్యూ మారుతి స్విఫ్ట్ వివరాలు ఇప్పుడు పూర్తిగా లీక్ అయ్యాయి. ఈ ఫోర్త్-జనరేషన్ స్విఫ్ట్ ముందుగా ఊహించినట్లుగానే జపాన్, ఇప్పుడు యూరప్‌లో మనం చూస్తున్నట్లుగానే ఉంది. స్విఫ్ట్ జపనీస్ ఆటోమేకర్ నుంచి వచ్చిన అత్యంత విజయవంతమైన గ్లోబల్ మోడల్ అని చెప్పడంలో ఏ మాత్రం ఆశ్చర్యపోనవసరం లేదు.
ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ హైలైట్స్
స్విఫ్ట్ఎక్స్‌టీరియర్ డిజైన్ హైలైట్స్ గా, న్యూ గ్రిల్, వీల్స్, హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. లోపల భాగంలో, మారుతి సుజుకి చాలా వరకు పాత ఫీచర్లను ఇందులో కలిగి ఉంది, అయితే న్యూ టచ్‌స్క్రీన్, క్లైమేట్ కంట్రోల్ ఇంటర్‌ఫేస్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో భారీ కలర్ ఎంఐడితో లేఅవుట్ ని పొందింది.
అనువాదించిన వారు: రాజపుష్ప